జులై 22 వ తేదీన ఇండియా ప్రయోగించిన చంద్రయాన్ 2 ప్రయోగం 98% శాతం సక్సెస్ అయ్యింది.  ల్యాండర్ విక్రమ్ చంద్రునిపై దిగే సమయంలో జరిగిన చిన్న సంకేతిక లోపం కారణంగా ల్యాండర్ హార్డ్ గా చంద్రునిపై దిగినట్టు, ఒక పక్కకు ఒరిగినట్టుఆర్బిటర్ చిత్రాల ద్వారా అనలైజ్ చేసి ఇస్రో పేర్కొన్నది.  ల్యాండర్ ముక్కలు కాలేదని, ఒక్కటిగానే ఉన్నట్టు ఆర్బిటర్ ద్వారా తెలిసింది.  ల్యాండర్ లో చలనం తీసుకొచ్చేందుకు ఇస్రో నాసా సహాయం కోరింది.  


నాసా తన తన కేంద్రాల నుంచి హైరేంజ్ రేడియో తరంగాలను చంద్రునిపైకి పంపింది.  కానీ లాభం లేకపోయింది.  ఈనెల 17 వ తేదీన నాసాకు చెందిన ఏఆర్ఎల్ ఆర్బిటర్ చంద్రుని దక్షిణ దృవం వైపుకు పయనించింది.  చంద్రునికి అతి దగ్గరగా ఈ ఆర్బిటర్ తిరుగుతుంది.  కాబట్టి ఈ ఆర్బిటర్ నుంచి తీసే ఛాయా చిత్రాలు స్పష్టంగా ఉంటాయి.  అందుకోసమే ల్యాండర్ విక్రమ్ ఛాయా చిత్రాల కోసం నాసాను కోరడం.. నాసా అందుకు అంగీకరించడం జరిగింది.  


అయితే, సెప్టెంబర్ 17 వ తేదీన ఏఆర్ఎల్ తీసిన ఛాయాచిత్రాలను పరిశీలించిన నాసా తమకు ల్యాండర్ చిత్రాలు కనిపించలేదని స్పష్టం చేసింది.  ఇస్రో ప్రయోగించిన ఆర్బిటర్ నుంచి స్పష్టమైన చిత్రాలు వెలువడితే.. చంద్రునికి తక్కువ దూరంలో పరిభ్రమణం చేస్తున్న ఆర్బిటర్ నుంచి ఎలాంటి చిత్రాలు లేవని చెప్పడం విడ్డూరం.  ఈ విషయంలో నాసా కంటే ఇస్రోనే బెస్ట్ అని చెప్పాలి.  


కాగా, ప్రస్తుతం చంద్రునిపై ల్యూనార్ నైట్ నడుస్తున్నది.  అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ లో ఉన్నది.  ఒకవేళ తిరిగి ల్యాండర్ గురించి సమాచారం ఏదైనా తెలుసుకోవాలి అంటే తప్పకుండా అక్టోబర్ 5 వ తేదీ వరకు ఆగాల్సిందే.  కాగా, ఇస్రో నెక్స్ట్ స్టెప్ ను సిద్ధం చేసుకుంటోంది.  చంద్రయాన్ 3, గగన్ యాన్ లపై దృష్టి పెట్టింది.  ఏడాది కోసం ఏర్పాటు చేసిన ఆర్బిటర్, ఏకంగా 7 సంవత్సరాలు పనిచేసే విధంగా మారడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: