ఉల్లి ఇప్పుడు కొనేవాళ్ల కళ్లు కూడా మండిస్తోంది. కిలో 60-70 రూపాయల ధర పలుకుతూ వంటింట్లో సెగలు రేపుతోంది. సామాన్యుడికి కొత్త కష్టాలు తెచ్చింది. కొన్నిరోజులుగా పెరుగతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు ఏపీ సర్కారు చర్యలు తీసుకుంటోంది. కేవలం నెలరోజుల వ్యవధిలో మూడింతలు పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టింది.


కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉల్లి పంటలు తీవ్రంగా దెబ్బతింది. ఆంధ్ర ప్రదేశ్ కు భారీస్థాయిలో దిగుమతి జరిగే మహారాష్ట్ర నుండి దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో ఒక్కసారిగా ఉల్లిపాయ ధరలకు రెక్కలు వచ్చాయి . మహారాష్ట్ర లో అధిక వర్షాలు కురవడంతో పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రాష్ట్రానికి సరుకు దిగుమతి గణనీయంగా తగ్గిపోయింది.


ఉల్లి ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. కొయ్యకుండానే కన్నీళ్లు తెప్పిస్తు న్నాయి. కొన్నిరోజులుగా ఉల్లి ధరలు అనూహ్యంగా పెరిగాయి. నెలరోజుల కింద రైతుబజార్లలో కిలోరూ.16 నుంచి రూ.20లు పలికింది. ఇదే ఉల్లి. ప్రస్తుతం కిలో రూ.55 నుంచి 60 రూపాయలు పలుకుతోంది.


ఉల్లి పెనుభారంగా మారిన పరిస్థితిని మార్చేలా.. ఉల్లిపాయలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఉల్లి విక్రయాలకు శ్రీకారం చుట్టింది. విజయవాడలో నగర ప్రజలు ప్రభుత్వ చొరవ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు..కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై దాడులు నిర్వహిస్తోంది. అటు డిమాండ్‌ తగ్గ ఉల్లిని అందుబాటులో ఉంచేందుకు జగన్ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది.


ప్రభుత్వాదేశాల మేరకు రైతు బజార్లలో ఉల్లి కౌంటర్లను ఏర్పాటు చేసిన అధికారులు కిలో ఉల్లిపాయలను 25 రూపాయలకు అమ్ముతున్నారు. కర్నూల్‌ నుంచి రాష్ట్రవ్యాపంగా ఉల్లిపాయలు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సామాన్యులకు అందుబాటు ధరలో ఉల్లిపాయల విక్రయాలు మొదలు పెట్టినట్లు అధికారులు తెలిపారు..ఉల్లిధర అదుపులోకి వచ్చే వరకు రైతు బజార్లలో ఉల్లికౌంటర్లు కొనసాగుతాయని రైతుబజార్ ఎస్టేట్ అధికారులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: