ఇప్పటి వరకు భూమిపై ఖండాలు ఎన్ని అంటే అందరు చెప్పే సమాధానం ఏడు.  ప్రపంచ వింతలు ఏడు.  సంగీతంలోని స్వరాలు ఏడు.. సముద్రాలు ఏడు ఇలా అన్ని ఏడు ఏడులానే ఉన్నాయి. కానీ, భూమిపై ఇప్పుడు మరో కొత్త ఖండం వచ్చింది.  ఈ ఖండంతో ప్రపంచంలో ఖండాలు ఎనిమిదిగా మారింది.  ఈ ఖండానికి ఆండ్రియా అనే పేరు పెట్టారు శాస్త్రవేత్తలు.  గ్రీన్ ల్యాండ్ పరిమాణంలో ఉన్న ఈ ఖండాన్ని మధ్యధరా ప్రాంతంలో కనుగొన్నారు.  


మధ్యదరా ప్రాంతంలో నెదర్లాండ్ శాస్త్రవేత్తలు పరిశోధన సాగిస్తున్న క్రమంలో ఈ ఖండం బయటపడింది.  14 కోట్ల సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికా నుంచి విడిపోయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.  కాగా, ఆ ఖండంలో మనుషులు జీవిస్తున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉన్నది.  భూమిపై జనం జీవించని ప్రదేశం లేదు.  ఒకవేళ గ్రీన్ ల్యాండ్ పరిమాణంలో ఉండే ఖండమైతే అక్కడ తప్పకుండా మనుషులు ఉండే ఉండాలి.  


మనం మన భూమిపై ఉన్న విషయాలనే పూర్తిగా తెలుసుకోకుండా స్పేస్ వైపు పరుగులు తీస్తున్నారు.  అలా కాకుండా ముందు భూమిపై ఉండే విషయాలను కూలంకుషంగా పరిశీలిస్తే.. ఆ తరువాత ఎక్కడికైనా వెళ్లొచ్చు.  అయితే, ఈ ఖండం విషయాన్నీ ప్రపంచం ఎంతవరకు గుర్తిస్తుంది అన్నది తెలియాలి.  ఒకవేళ దాన్ని ఒక ఖండంగా గుర్తిస్తే.. దానిపై ఆదిపత్యం కోసం మరలా పోరాటం మొదలౌతుంది అనడంలో సందేహం లేదు.  


ఇప్పటికే ప్రపంచంలో ఆధిపత్యం కోసం నిత్యం పోరాటాలు, యుద్దాలు జరుగుతున్నాయి.  జాన భూమిని కూడా ఏ దేశం వదులుకోవడానికి సిద్ధంగా ఉండటం లేదు.  భూమి విలువ అది.  భూమి ఉంటె ఎంత లాభమో పెద్దపెద్ద దేశాలకు తెలుసు.  రష్యాలో ఎంత భూమి ఉన్నదో అందరికి తెలిసిందే.  జనాభా తక్కువ.  అక్కడ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ జీవించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: