ఈ ఘటన చూస్తే కళ్యాణ్ రామ్ సినిమా గుర్తొస్తుంది. అధికారం ఉందని డబ్బు కోసం చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు నీలోఫర్ డాక్టర్లు. నీలోఫర్ ఆసుపత్రిలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. చిన్నారులకు వైద్యం అందించాల్సింది పోయి వారిపైనే ప్రయోగాలు చేస్తున్నారు డాక్టర్లు.                                          


వైద్యం కోసం వచ్చిన చిన్నారులపై ఫార్మా కంపెనీల నుంచి కొత్తగా అభివృద్ధి చేసిన మందులు, వ్యాక్సిన్లను పిల్లలపై ప్రయోగిస్తున్నారు. ఆ మందులు విజయవంతం అవుతే వాటిని మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా.. ఫార్మా కంపెనీల నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుంటూ పిల్లలపై ప్రయోగాలు చేస్తున్నారు ఈ నీచ డాక్టర్లు.                        


చిన్నారులపై డ్రగ్స్ కూడా ట్రయల్స్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఘటన ఎలా బయటకి వచ్చింది అనుకుంటున్నారా ? అదే నిలోఫర్ ఆసుపత్రిలో పని చేసే ఇద్దరు డాక్టర్లు గొడవ పడటంతో ఈ వ్యవహారం బయటపడింది. దీంతో ఈ ఘటనపై విచారణ జరపాలని, అలాగే ఆసుపత్రిలో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ వివరాలు అందజేయాలని వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్ రెడ్డి ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్లినికల్ ట్రయల్స్ ఇప్పటికే 50మందికి జరిగాయని సమాచారం. ఏది ఏమైనా కాపాడాల్సిన డాక్టర్లే కాసుల కోసం ఇంత నీచానికి దిగజారడం చాల ఘోరం.                                   


మరింత సమాచారం తెలుసుకోండి: