గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరాన్ని వానలు పట్టిపీడిస్తున్నాయి.  ఈ వానల కారణంగా రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.  అపార్ట్మెంట్ సెల్లార్లలోకి నీళ్లు వెళ్లడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు.  నగరంలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో.. ప్రజలు అగచాట్లు పడుతున్నారు.  డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు.  మరో మూడు నాలుగు రోజులు నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.  ముఖ్యంగా సాయంత్రం వేళల్లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి.  


నిన్నటి రోజున హైదరాబాద్ నగరాన్ని వానలు ముంచెత్తాయి.  నగరంలో సరాసరి 10సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.  ఇలా మరో వారం రోజులు ఉంటె.. నగరంలో వరదలు రావడం ఖాయం అని, 2000 సంవత్సరంలో జరిగిన విధంగా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. దీంతో హుస్సేన్ సాగర్ నుంచి నీటిని తూముల ద్వారా మూసి కాలువకు మళ్లిస్తున్నారు.  


మూసి కాలువ ఏరియాలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.  అయితే, గత ఎండాకాలంలో చేపట్టిన పూడిక పనులను సక్రమంగా జరగకపోవడమతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  పూడిక కార్యక్రమం సరిగా లేకుంటే.. దానివలన నీటిని కిందకు వదిలినపుడు సమస్యలు తలెత్తుతాయి.  ఫలితంగా నీరు ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజల ఇళ్లల్లోకి చేరే అవకాశం ఉంటుంది.  హుస్సేన్ సాగర్ నుంచి 26 తూముల ద్వారా 3,096 క్యూసెక్కుల నీటిని మూసిలోకి వదులుతున్నారు.  


వర్షాలు, ఇతర ప్రాంతాలనుంచి వచ్చి హుస్సేన్ సాగర్ కు నీరు చేరుతున్నది.  మూసి ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా హెచ్చరించినప్పటికీ అక్కడి ప్రజలు ఖాళీ చేసి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు.  నగరపాలక సంస్థ సరైన అవగాహనా కల్పించకుండా.. ఇలా నీళ్లను వదలడం వలన ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు.  అక్కడే ఉంటె నీటి వలన ఇబ్బందులు తలెత్తుతాయి.  అక్కడి నుంచి ఖాళీ చేస్తే ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి మధ్య ప్రజలుజీవిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: