ప్రస్తుతం న్యూయార్క్ లో  ఐరాస సర్వసభ్య దేశాల సమావేశం జరుగుతున్నది.  ఈ  సమావేశానికి  ప్రపంచంలోని అన్ని దేశాల అధినేతలు హాజరవుతున్నారు.  ఈ సమావేశాల్లో ఇండియా తన సత్తాను చాటుకుంటోంది.  ఇప్పటికే ఇండియా.. అమెరికా దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి. రష్యాతో సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి.  చైనా వ్యతిరేకమే అయినా.. వాణిజ్యపరంగా ఇండియాతో బలంగా ఉన్నది.  అలానే చుట్టుపక్కల ఉన్న దేశాలు, అరబ్ దేశాలు ఇండియాతో సంబంధాలను బలంగా కొనసాగిస్తోంది.  


కాశ్మీర్ విషయంలో ఇండియా తన వాణిని అక్కడ బలంగా వినిపించింది.  ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే స్పష్టం చేసింది.  ఉగ్రవాదం ఎక్కడున్నా ఉగ్రవాదమే.. అదే అన్ని దేశాలను ఒక్కటి చేస్తోంది.  ఇప్పటికే ఫ్రాన్స్ లో ఉగ్రవాదులు ఎలాండి దాడులు చేశారో తెలిసిందే.  యూరప్ దేశాల్లో కూడా ఉగ్రవాదులు అలజడులు సృష్టిస్తున్నారు.  దీని నుంచి బయటపడేందుకు ఆయా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.  


ఇదిలా ఉంటె, ఇండియాకు అరబ్ దేశాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి.  కాగా, ఐరాస వేదికగా సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది.  ఈ సమావేశానికి సార్క్ సభ్యదేశాలు విదేశాంగ మంత్రులు హాజరయ్యారు.  అయితే, పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి హాజరు కాకపోవడం విశేషం.  ఇండియా విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ తో కలిసి చేతులు కలపడం ఇష్టంలేకనే జయశంకర్ హాజరుకాలేదు.  అంతేకాదు, కాశ్మీర్ విషయంలో అభ్యంతరాలు ఉన్నాయని అందుకే హాజరు కాలేదని అంటున్నారు.  


అయితే, పాక్ విదేశాంగశాఖ మంత్రి హాజరు కాకపోవడంపై ఇండియా ఎలాంటి ప్రకటన చేయలేదు.  దాని గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు.  సార్క్ దేశాల మధ్య ఉండాల్సిన సంబంధాల గురించి జయశంకర్ మాట్లాడారు.  సార్క్ దేశాల,విశ్వవిద్యాలయం  ట్రేడ్, సాంకేతిక పరిజ్ఞానం వంటి విషయాలపై సహకరించుకోవాలని కోరారు.  ఇండియా అందుకు సదా సిద్ధంగా ఉందని జయశంకర్ పేర్కొన్నారు. కాగా, వచ్చే సార్క్ సమావేశాలు ఇస్లామాబాద్ లో జరుగుతుందని ఒక మాట మాట్లాడి వెళ్ళిపోయాడు ఖురేషి.  


మరింత సమాచారం తెలుసుకోండి: