ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు దేశంలో మంచి పేరు ఉన్నది.  పవర్ ఫుల్ లీడర్.  అందులో సందేహం అవసరం లేదు.  అయితే, అయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వంలో అనేక పదవులు అలంకరించారు.  అనేక స్కామ్ లతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే.  అయితే, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో అవినీతిని అంతమొందిస్తామని, అవినీతికి పాల్పడే వ్యక్తులు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. 


మోడీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తరువాత దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదని, అవినీతిని అంతం చేస్తామని చెప్పిన మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేశారని అనేకమంది పేర్కొన్నారు.  కానీ, మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టికల్ 370 రద్దు చేయడమే కాకుండా ట్రిపుల్ తలాఖ్ ను తీసుకొచ్చారు.  జమ్మూ కాశ్మీర్ విషయంలో అభివృద్ధి దిశగా అడుగులువేయిస్తున్నారు .  అంతేకాదు, ఇప్పుడు దేశంలోని అవినీతి వ్యక్తులపై దృష్టి పెట్టింది.  


ఇందులో భాగంగానే కోల్ కతా శారద స్కామ్ లో సంబంధం ఉన్న కోల్ కతా మాజీ కమిషనర్ ను అదుపులోకి తీసుకున్నారు.  అంతేకాదు, ఐనాక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.  ప్రస్తుతం అయన తీహార్ జైలులో ఉన్నారు.  అలానే కర్ణాటకకు చెందిన ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న డికె శివకుమార్ ను ఈడీ అరెస్ట్ చేసింది. అయన సైతం తీహార్ జైలులో ఉన్నారు.  


ఇప్పుడు మహారాష్ట్రపై ఈడీ దృష్టి పెట్టింది. కొన్ని స్కామ్ ల విషయంలో ఈడీ శరద్ పవార్ ను ప్రశ్నించే అవకాశం ఉన్నది.  ఇప్పటికే ఆయన ఆఫీస్ లపై దాడులు చేస్తున్నారు. ఈడీ దాడుల్లో పురోగతి కనిపిస్తే... ఆయన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.  ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి అది పెద్ద దెబ్బ అవుతుంది.  ఎలాగైనా అధికారంలోకి రావాలని శరద్ పవార్ తో పొత్తు పెట్టుకున్నారు.  కాంగ్రెస్ పార్టీ తక్కువ స్థానాల్లో పోటీ చేస్తూ.. ఎక్కువ స్థానాలు ఎన్సీపీకి కట్టబెట్టారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: