మాములు బస్సుల్లో ప్రయాణం చేసే సమయంలోనో లేదంటే..మాములు రైళ్లలో ప్రయాణం చేసే సమయంలోనో ఉక్కపోతగా ఉందని అనిపిస్తే.. వెంటనే కిటికీ  అద్దాలు తెరుస్తారు.  దాంతో ఫ్రెష్ గాలి లోపలికి వస్తుంది.  ఉపశమనం కలుగుతుంది.  రైల్లో కూడా అంతే.  అదే ఏసీ బస్సుల్లో, ఏసీ రైళ్లలో ప్రయాణం చేసే సమయంలో డోర్స్ మూసేసి ఉంటాయి.  తెరవరు.  ఈ విషయం అందరికి  తెలుసు.  ఒకవేళ ఎమర్జెన్సీ డోర్స్ తెరిచినా పెద్దగా ఏమి జరగదు.  


అదే విమానంలో అలా చేస్తే.. ఇంకేమైనా ఉందా.. విమానంలో డోర్ తెరిస్తే విమానం కూలిపోతుంది.  అందుకే కిటికీ డోర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి.  కానీ, ఓ మహిళా విమానం ఎక్కిన తరువాత ఒక్కపోతగా ఉందని చెప్పి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసింది.  అలా చేయకూడదు అని ప్రయాణికులు వారిస్తున్న ఒప్పుకోలేదు.  పైగా.. విమానం కదిలే సమయంలో మూసేస్తా అని చెప్పింది.  దీంతో సిబ్బంది ఆమెను బలవంతంగా కిందకు దించారు.  


పోలీసులకు అప్పగించారు.  ఆమెపై కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.  లైఫ్ లో విమానం ఎక్కకుండా నిషేధం విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  ఈ సంఘటన చైనాలో జరిగింది.  చైనాలోని హుబిలోని టియాన్హ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న జియమెన్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కిన మహిళ ఉక్కపోతగా ఉండటంతో తన పక్కనే ఉన్న ఎమర్జన్సీ డోర్ తెరిచింది. పక్కనే కూర్చొన్న ప్రయాణికులు అలా చేయకూడదని వారించినా ఆమె మాట వినలేదు. 


తనకు ఉక్కబోతగా ఉందని, తలుపు తీస్తే ఫ్రెష్ ఎయిర్ వస్తుందని తెలిపింది. విమానం బయల్దేరేందుకు సిద్ధం కాగానే మూసేస్తానని తెలిపింది. దీంతో విమాన సిబ్బంది ఆమెను విమానం నుంచి కిందికి దించేసి పోలీసులకు అప్పగించారు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.  మామూలుగానే వాతావరణం అనుకూలించకో లేదంటే.. ఇతర సాంకేతిక కారణాల వలనో ఆలస్యం అవుతుంటాయి.  ఇలాంటి ప్రయాణికులు నెలకొకరు విమానాల్లో ఎక్కారు అంటే.. ఇక అంతే ఫైన్లు మీద ఫైన్లు కట్టుకుంటూ ఉండాలి.  అసలే విమానయాన రంగం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడిపోయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: