భారతదేశంలో ఎయిర్ టెల్, జియో, ఐడియా, వొడాఫోన్ సిమ్ కార్డులు వాడే కస్టమర్లు ఎక్కువమంది ఉన్నారు. ఈరోజు ఉదయం సమయంలో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో ఐడియా నెట్ వర్క్ సర్వర్ డౌన్ అయింది. మొబైల్ ఫోన్లలో నెట్ వర్క్ సమస్యలు ఏర్పడటంతో ఏమైందో అర్థం కాని వినియోగదారులు ఆందోళన పడ్డారు. ఐడియా సిమ్ కార్డ్ వినియోగిస్తున్న కస్టమర్లలో చాలా మందికి ఈ సమస్య ఎదురయిందని సమాచారం 
హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, పూణె, లక్నో, బెంగళూరు చెన్నై ప్రాంతాలలో ఐడియా ప్రీపెయిడ్ సర్వర్ డౌన్ అయిందని తెలుస్తోంది. సర్వర్ డౌన్ కావటంతో ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ విషయంలో సమస్యలు ఏర్పడ్డాయి. సర్వర్ డౌన్ కావటంతో ఐడియా వినియోగదారులు భారీ సంఖ్యలో కామెంట్లు పెడుతున్నారు. ఐడియా నెట్ వర్క్ లో 60 శాతం నెట్ వర్క్ డౌన్ అయిందని సమాచారం అందుతుంది. ఐడియా ఇంటర్నెట్ కూడా 10 శాతం వరకు డౌన్ అయిందని టెక్ నిపుణులు చెబుతున్నారు. 
 
ఈరోజు ఉదయం ఈ సమస్య మొదలు కావటంతో ఏమైందో అర్థం కాని వినియోగదారులు మొబైల్ రీస్టార్ట్ చేయటం, నెట్ వర్క్ సెట్టింగ్స్ లో మార్పులు చేయటం చేశారు. కానీ సమస్య తీరలేదు. 11 గంటల సమయంలో హైదరాబాద్ నగరంలో ఈ సమస్య మొదలయిందని సమాచారం. పూణెలో 12 గంటల సమయంలో ఈ సమస్య మొదలయిందని తెలుస్తుంది. కస్టమర్లు నెట్ వర్క్ సమస్యలు ఏర్పడటంతో కస్టమర్ కేర్ నంబర్ కు కాల్ చేయటానికి ప్రయత్నాలు చేశారు. 
 
కానీ ఆ నంబర్ కు కూడా కాల్ కనెక్ట్ కాలేదు. గతంలో కూడా మూడు సార్లు ఐడియా నెట్ వర్క్ వినియోగదారులు ఈ సమస్యతో ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది. ఐడియా పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు కూడా సిగ్నల్స్ నిలిచిపొవటంతో ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది. సిగ్నల్స్ సమస్యలతో ఐడియా పోస్ట్ పెయిడ్ కస్టమర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: