ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ  మంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రబలుతున్న డెంగ్యూ, మలేరియా వ్యాధులపై మీడియాతో మాట్లాడారు. వర్షాకాలం సీజన్ మొదలింది అంటేనే ప్రభుత్వం అన్ని రకాల చర్యలతో జ్వరాలు ప్రబలకుండా ఉండటం కొరకు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించటం కొరకు  ప్రయత్నాలు చేస్తుంది. ఈ మధ్య కాలంలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉండటం వలన వాతావరణ పరిస్థితులలో మార్పులు వచ్చాయి. 
 
వాతావరణ పరిస్థితులలో మార్పుల వలన వ్యాధులు వస్తూ ఉండటంతో ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రుల వైపు వెళుతున్న మాట వాస్తవం. ప్రజలకు ఇప్పటికే అనేక సార్లు విజ్ఞప్తులు చేయటం జరిగింది. జ్వరాలు అన్నీ కూడా డెంగ్యూ జ్వరాలు కాదు. జ్వరాలు అన్నీ కూడా మలేరియా జ్వరాలు కావు. ఎక్కువ శాతం వచ్చే జ్వరాలు వైరల్ జ్వరాలు మాత్రమేనని గాబరా పడవద్దని అన్నారు. కొన్ని చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నమాట వాస్తవమే అని అన్నారు. 
 
ప్రభుత్వ ఆస్పత్రులలో ఓపీ టైమింగ్స్ పెంచుకుని గ్రామాలలో మరియు పట్టణాలలో క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. 15, 20 రోజుల్లో వర్షాకాలం ముగుస్తుందని ఈ 15, 20 రోజులపాటు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో వ్యాధుల నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా సహకరించాలని ఈటల కోరారు. 
 
వైరల్ జ్వరాలకు ఖరీదైన మందులు అవసరం ఉండవని ఆ మందులన్నీ ఆస్పత్రులలో అందుబాటులోనే ఉన్నాయని మంత్రి అన్నారు. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఈటల అన్నారు. సామాన్యులు వైరల్ జ్వరాలు రాగానే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి లక్షలు లక్షలు ఖర్చు పెట్టవద్దని మంత్రి ప్రజలకు సూచించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: