వైద్యోనారాయణో హరి అని డాక్టర్‌ను దేవుడితో పోల్చారు పెద్దలు.ఆ పెద్దరికానికే కళంకం తెచ్చేలా ప్రవర్తించారు నీలోఫర్ ఆస్పత్రిలోని ప్రొఫెసర్లు.ప్రాణం పోయాల్సిన చేతులతో చిన్నారుల ప్రాణాలను గాలి బుడగల్లా భావించి నరకం చూపించి చిదిమేస్తున్నారు..గ్రామీణ ప్రాంతాలనుండి చికిత్స కోసం వచ్చే అన్నెం పున్నెం ఎరుగని చిన్నారులపై క్లీనికల్ ట్రయల్స్ ప్రయోగం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతూ సొమ్ము చేసుకుంటున్నారు.అక్రమంగా వచ్చే సొమ్ముతిని వారు ఎన్ని మేడలు కడతారో తెలియదు కాని పసి పిల్లలు అనే కనికరం కూడా లేకుండా వారు చేస్తున్న క్లినికల్ ట్రయల్స్ కలకలం రేపుతున్నాయి..



ఫార్మా కంపెనీలతో కుమ్మక్కైన ఓ ప్రొఫెసర్ వైద్యం కోసం ఆస్పత్రిలో చేరే చిన్నారులపై ప్రైవేట్ ఫార్మా కంపెనీల మెడిసిన్, వ్యాక్సిన్ ప్రయోగిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.ఈ విషయాన్ని కొంతమంది ఆస్పత్రి సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.దీంతో క్లినికల్ ట్రయల్స్‌పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.ఈ హస్పిటల్‌ల్లో ఉన్న ఓ ప్రొఫెసర్ ప్రైవేట్ ఫార్మా కంపెనీల డబ్బు ప్రలోభాలకు లొంగిపోయి కొంతమంది వైద్యులతో కలసి క్లినికల్ ట్రయల్స్‌కు పాల్పడినట్టు తెలుస్తోంది.ఈ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన యవ్వారం ఇన్నాళ్లు గుట్టుగా నడిచింది.కాని వారి పాపం పండినరోజు వచ్చింది కాబట్టి ఆ ఇద్దరు వైద్యుల మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఈ విషయం వెలుగుచూసిందంటున్నారు.



ఇప్పటివరకు 50 మందికి పైగా చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ జరిగాయని,చిన్నపిల్లలపై ప్రయోగించిన నిషేధిత మందుల ను కూడా గుర్తించినట్టు సమాచారం.ఇక వైద్య ఆరోగ్యశాఖ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ,బాధ్యులను కఠినంగా శిక్షించాలని భావిస్తోందట..ఇక ఈ క్లినికల్ ట్రయల్స్ జరిపిన వైద్యుల మెడికల్ లైసెన్స్ రద్దు చేయాలని బాధిత చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారట.ఇక నీలోఫర్ ఆస్పత్రి అంటే పేరొందిన ఆస్పత్రి కావడంతో,తమ చిన్నారులను చూపించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఎక్కడెక్కడి నుండో వస్తుంటారు.ఇక్కడ పిల్లల ఓపీ సైతం భారీగానే ఉంటుంది. ఇంతగా పేరున్న హస్పిటల్లో ఇలాంటి నికృష్టపు పనులు జరగడం అది కేసీయార్ గారి హయామంలో జరగడం.చాల విచార కరమని బాధిత కుటుంబీకులు మధన పడుతున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: