ఆమె పోలీస్ కావాలని ఎన్నెన్నో కలలు కన్నది. పోలీస్ గా ప్రజలకు  సేవ చేయాలనే దృక్పధంతో ముందుకు కదిలింది. ఎలాగైనా పోలీస్ జాబ్ కొట్టాలని నిరంతరం శ్రమించింది. చివరికి పోలీస్ జాబ్ దక్కకపోవడం  తో ఆత్మ హత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. ఉన్నత చదువులు చదివిన తమ  కూతురు ఉన్నతమైన పదవి చేపడుతుంది అనుకున్న తల్లిదండ్రులకి తీరని శోకాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది.వరంగల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.  

 

 

వివరాల్లోకి వెళ్తే... వరంగల్ జిల్లా మిల్స్ కాలనీలో  ఈ  విషాదం చోటు చేసుకుంది. మిల్స్ కాలనీలో ఉండే రవీందర్, రాణి దంపతులకి ఇద్దరు కూతుర్లు ఓ కొడుకు ఉన్నారు.కూతురు కొడుక్కి పెళ్లిళ్లు అవ్వగానే... ఎంబీఏ చదివిన చిన్న కూతురు శృతి ఈ మధ్య ఎసై  జాబ్ కి  అప్లై చేసింది. కాగా ఎసై పరీక్ష పాసైన శృతి... అన్ని ఈవెంట్స్ లో క్వాలిఫై అయింది. రిటర్న్ టెస్ట్ లో 106 మార్కులు కూడా వచ్చాయి కానీ శ్రుతికి మాత్రం పోలీస్ ఉద్యోగం రాలేదు. పోలీస్ గా ఉద్యోగం చేయాలనుకునే శృతి జాబ్ వస్తుందని కోటి ఆశలతో ఎదురు చూస్తుంది. 

 

 

కానీ జాబ్ మాత్రం రాలేదు...కచ్చితంగా వస్తుందనుకున్న పోలీస్ జాబ్ రాకపోవటం తో తీవ్ర మనో వేదనకి గురైంది శృతి. దీంతో ఆత్మ హత్య  చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంట్లో అందరు పడుకున్న సమయంలో ఉరి వేసుకుని తనువు చాలించింది ఆమె. కుటుంబ సభ్యులు ఉదయాన్నే లేచి చూడగా ఉన్నత పదవి చేపడుతుందని భావించిన తమ కూతురు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించటం తో కుటుంబ సభ్యుల గుండె పగిలిపోయింది. కాగా ఆమెను హుటాహుటీన ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. శృతి చనిపోయిందని డాక్టర్లు నిర్దారించారు. దీంతో శృతి తల్లి దండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో శృతి తండ్రి రవీందర్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: