హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు రేపు జరగనున్నాయి. ప్రధానంగా రెండు ప్యానెల్స్‌ మధ్యనే పోటీ తీవ్రంగా పోటీ నెలకొంది.   టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ప్యానెల్‌కు , ప్రకాశ్‌ చంద్‌ జైన్‌ ప్యానెల్‌కి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. అజారుద్దీన్‌, ప్రకాశ్‌ చంద్‌ జైన్‌లు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. సెక్రటరీ పదవి కోసం మాజీ సెక్రటరీ వెంకటేశ్వరన్, ఆర్‌. విజయానంద్‌ మధ్య పోటీ నెలకొంది. 

మరోవైపు ప్రకాశ్ చంద్ ప్యానెల్‌ నుంచి ఉపాధ్యక్ష పదవికి దల్జీత్ సింగ్‌, జాయింట్ సెక్రటరీ పదవికి శివాజీ యాదవ్‌, ట్రెజరర్ పదవికి హనుమంత్ రెడ్డి పోటీ పడుతున్నారు. అజార్‌ ప్యానెల్‌ నుంచి కే జాన్ మనోజ్‌ ఉపాధ్యక్ష పదవికి, సురేందర్ కుమార్ అగర్వాల్ ట్రెజరర్ పదవికి, నరేశ్ శర్మ జాయింట్ సెక్రటరీ పదవికి పోటీ పడుతున్నారు. బరిలో మూడు ప్యానెల్స్‌ ప్రధానంగా నిలిచినా..ప్రధాన పోటీ మాత్రం అజార్‌ ప్యానెల్‌కు, ప్రకాశ్ చంద్ ప్యానెల్‌కు మధ్యనే నెలకొన్నట్లు సమాచారం. తాజాగా మాజీ కెప్టెన్, క్రికెటర్ అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. 74 ఓట్లతో అజారుద్దీన్ ఘన విజయం సాధించారు.

హెచ్‌సీఏ ఎన్నికల్లో ప్రధానంగా మూడు ప్యానెల్స్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే.  హెచ్‌సీఏలో మొత్తం 226 మంది సభ్యులు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ జరిగింది. 4 గంటలకు ఫలితాలను వెల్లడించారు. కాగా, ఈ పోటీలో మొత్తం ఆరు పదవులకు 17 మంది బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఇందులో  45 మంది నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు జి.వివేక్ వెంకటస్వామి దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. హెచ్‌సీఏ అధ్యక్ష పీఠాన్ని అజారుద్దీన్ కైవసం చేసుకున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: