చంద్రబాబుకు జ్ఞానోదయం అయినట్లుంది. అధికారంలో ఉన్నప్పుడు పాలనలో పడిపోయి...పార్టీని గాలికొదిలేసిన చంద్రబాబు ఇప్పుడు పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నంత కాలం పార్టీ బలంగా ఉందని భావించిన టీడీపీ అధినేతకు...మొన్న ఎన్నికల్లో ఘోరంగా 23 సీట్లు తెచ్చుకున్నప్పుడు సీన్ అర్ధమయ్యినట్లుంది. అప్పుడు చుట్టూ భజనబృందాలు ఉండటం వలన, వాళ్ళు ఏం చెబితే అది నమ్మారు. దాని వల్ల పార్టీకి ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరిగిపోయింది.


పైగా పార్టీ మారి వచ్చిన వారికి, భజన చేసిన వాళ్ళకే పదవులు ఇచ్చారు గానీ, కింది స్థాయిలో కష్టపడుతున్న కార్యకర్తలకు, నాయకులకు ఎలాంటి పదవి దక్కలేదు. ముఖ్యంగా టీడీపీకి ఎప్పుడు అండగా ఉండే బీసీ వర్గాల వారిని పెద్దగా పట్టించుకోలేదు, ఫలితంగా ఎన్నికల్లో బీసీ వర్గాలు టీడీపీకి దూరమయ్యాయి. దాని వల్ల ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వచ్చిందో కూడా తెలుసు.


ఇక అధికారం పోయింది. భజనబృందాలు ఎవరి పని వారు చేసుకోవడం మొదలుపెట్టారు. కొందరు పార్టీ మారిపోతే...మరికొందరు సైలెంట్ గా సినిమా చూస్తున్నారు. అయితే అక్కడక్కడ యాక్టివ్ గా ఉన్న నేతలతో బాబు చర్చలు జరుపుతూ.,.పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దసరా తర్వాత పార్టీని ప్రక్షాళన చేయడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా పార్టీ పదవులు పంపకాలు చేయాలనుకుంటున్నారు. ఆ పదవుల్లో ముఖ్యంగా మహిళలు, యువత, బడుగుబలహీన వర్గాలకే కార్యవర్గాలలో ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తున్నారు.


తొలుత తెదేపా అనుబంధ సంఘాల నుంచే ప్రక్షాళన ప్రారంభించాలని పార్టీ అధినేత చంద్రబాబు డిసైడ్ అయ్యారు. పార్టీకి తొలి నుండి అండగా ఉన్న బీసీ వర్గాల్లో తిరిగి ఆదరణ పొందే విధంగా పార్టీలో పదవులు కట్టబెట్టాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ దసరాకు మొదలుపెట్టి నవంబరు నెలాఖరుకు పూర్తి చేయనున్నారు. అలాగే ప్రాంతాల వారీగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో..త్వరలో స్థానిక సంస్థలు..మున్సిపల్ ఎన్నికలను పరిగణలోకి తీసుకొని పార్టీ ప్రక్షాళన దిశగా చర్యలు ప్రారంభించారు.


ఇందులో భాగంగా పాత కార్యవర్గాల్లో సరిగా పని చేయని నేతలని పక్కనబెట్టేయనున్నారు. ఇక ఇప్పటివరకూ టీడీపీ అనుబంధ సంఘాలన్నీ జిల్లా కమిటీలుగానే ఉండేవి. అయితే వాటిని ఇప్పుడు పార్లమెంటు స్థానాల వారీగా కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే అంతకముందు కార్యవర్గం కాలపరిమితి అయ్యేవరకు వారిని కొనసాగించేవారు. కానీ ఇప్పుడు అలా కాకుండా వారి పనితీరు ఆధారంగా కొనసాగించనున్నారు. ఎక్కడైనా తేడా వస్తే వారిని వెంటనే తొలగించి కొత్తవారిని నియమిస్తారు. మరి ఈ క్రమంలో చంద్రబాబు ఎవరికి షాక్ ఇస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: