వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావొస్తుంది. ఈ నాలుగు నెలల కాలంలో గతంలో ఏ ప్రభుత్వం తీసుకొని విధంగా సీఎం జగన్ సరికొత్త నిర్ణయాలని తీసుకుని వాటిని అమలు చేస్తున్నారు. తొలిసారి సీఎం అయినా...పాలనని పరుగులెత్తిస్తున్నారు. నవరత్నాలు అమలు గానీ, పోలవరం రివర్స్ టెండరింగ్ గానీ, లక్షల్లో గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలు కల్పించడం గానీ ఇలా చాలానే నిర్ణయాలు అమలు చేశారు. అయితే ఈ విధంగా జగన్ పాలనలో దూకుడు ప్రదర్శిస్తుంటే...మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం చప్పగా కనిపిస్తున్నారు.


అసలు ఏ మాత్రం జగన్ స్పీడుని అందుకోలేకపోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. విప్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతున్న సీఎంని మంత్రులు, ఎమ్మెల్యేలు అందుకోలేకపోతున్నారనే మాట వినిపిస్తోంది. జగన్ తో పాటు స్పీడుగా వెళ్లలేక మంత్రులు నానా ఇబ్బందులు పడుతున్నారట. సరే మంత్రులు తీరు అలా ఉంది అనుకుంటే...ఎమ్మెల్యేలు కూడా వారికి ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నారట.


ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త నిర్ణయాలని గానీ, అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను గానీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యేలు ఘోరంగా విఫలమవుతున్నారట. అసలు ప్రతిపక్షాలు చేస్తున్న కౌంటర్లకు అటు మంత్రులు గానీ, ఇటు ఎమ్మెల్యేలు గానీ ధీటుగా కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారట. అంతేకాదు కీలక పరిస్థితుల్లో మంత్రులు చాకచక్యంగా వ్యవహరించలేకపోతున్నారని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.ఇక కొందరు ఎమ్మెల్యేలు అయితే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నియోజకవర్గాల్లో అందుబాటులోకి రాలేదట.

ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ మేల్కొపోతే భవిష్యత్ లో వైసీపీకి కష్టాలు తప్పవని రాజకీయ విశ్లేషుకులు అంటున్నారు. అయితే ఈ క్రమంలోనే మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని జగన్ కు అర్ధమైందని తెలిసింది. అందుకే జగన్ మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో తాను ఒక్కడినే కష్టపడితే పనులవ్వవని....మీరు కూడా స్పీడుగా పని చేయాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు క్లాస్ పీకినట్లు సమాచారం. మరి చూడాలి ఇప్పటికైనా మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్ స్పీడుని అందుకుంటారో లేదో.



మరింత సమాచారం తెలుసుకోండి: