ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచనాలను రేపుతున్న నాయకుడు జగన్.ఇప్పటికే ఇచ్చిన మాట మీద నిలబడే నిజమైన నాయకుడు అనిపించుకున్నాడు..ఈయన తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ముందుచూపు వుంటుంది.తాజాగా ఇప్పుడు వర్షాలు వస్తే ప్రజా జీవనం ఎంత దుర్లభంగా మారుతుందో ప్రత్యక్షంగా చూసారు కాబట్టి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.వర్షాకాలంలో నగర ప్రజలజీవనం దుర్భరం గా మారుతోందని..వర్షాలతో,ముంబై,చెన్నై లాంటి నగరాల్లో ఏంజరుగుతుందో చూస్తున్నామని..అలాంటిపరిస్థితి మనం తెచ్చుకో కూడదని అధికారులకు సూచించారు.



కాల్వల ప్రవాహాలకు అడ్డంగా వున్న నిర్మాణాల వలన సమస్యలను కొనితెచ్చుకున్నట్లేనన్నారు.పైగా వాటికి చట్టబద్ధత ఉండదని..ఎప్పటికీ పట్టా కూడా రాదని..చట్టాలు దీనికి అంగీకరించవన్నారు.ఈ సందర్భంగా నగరాలు,మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రణాళికలపై సీఎం జగన్‌ సుదీర్ఘంగా చర్చించారు.తాగునీరు,భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ,వ్యర్థాల తొలగింపు, మురుగునీటి శుద్ధి,పర్యావరణ పరిరక్షణ ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు.ప్రతి మున్సిపాలిటీలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఉండాలని..మురుగునీటి శుద్ధి ఉండేలా ప్రతి మున్సిపాలిటీకి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు..



తాగునీటి పైపులైన్లు డ్రైనేజీతో సంబంధం లేకుండా చూసుకోవాలని.పట్టణాలు,నగరాల్లో వ్యర్థాల సేకరణ సరిగ్గా ఉండడం లేదని కావున వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.తాగునీరు,డ్రైనేజి,ఇళ్లు,కరెంటు,రేషన్‌ కార్డు, పెన్షన్,ఆరోగ్యశ్రీ పై గ్రామ,వార్డు సచివాలయాలు దృష్టిపెట్టాలన్నారు.ప్రజలకు ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కారం అయ్యే విధంగా నగరాలు, మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రణాళికలపై సీఎం జగన్‌ సుదీర్ఘంగా చర్చించారు. తాగునీటి పైపులైన్లు డ్రైనేజీతో సంబంధం లేకుండా చూసుకోవాలని..పట్టణాలు,నగరాల్లో వ్యర్థాల సేకరణ సరిగ్గా ఉండడం లేదన్నారు.ఆ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా..తక్షణమే పరిష్కారం అయ్యేవిధంగా ఉండాలన్నారు...ఇది ప్రజల ప్రభుత్వమని వారికోసం మనందరం పనిచేయాలని ప్రతి ఉద్యోగికి సూచించారు..


మరింత సమాచారం తెలుసుకోండి: