ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశంలో మోదీ మోదీ కీలక ప్రసంగం చేశారు. ఆయన ప్రసంగంలోని కీలకాంశాలు.. “గాంధీజీ చెప్పిన సత్యం, అహింస ఎప్పటికీ అనుసరణీయమేనని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సింగిల్యూాజ్ ప్లాస్టిక్ వద్దని ఐరాస గోడల మీద ఉంది. భారత్లోక అక్టోబర్ 2నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టీక్ నిషేధించాలని నిర్ణయించాం. వచ్చే ఐదేళ్లలో 15 కోట్ల ఆవాసాలకు తాగునీరు అందించబోతున్నామన్నాం. భారత్ లో ఆరోగ్య బీమా పథకాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నాం. 50 కోట్ల మందికి రూ.5 లక్షల బీమా అమలవుతూ ప్రపంచానికే భారత్ ఆదర్శంగా నిలుస్తోంది. ఐదేళ్లలో 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించామ”న్నారు. 

 

 

 

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ప్రపంచం ఎదుర్కొనే అనేక సమస్యలకు కొత్త పరిష్కారాలు కనుక్కుంటున్నాం. భూతాపం, కాలుష్య కారకాల్లో భారత్ చివరి వరుసలో ఉంది. కాలుష్య నివారణలో మాత్రం భారత్ అగ్రస్థానంలో ఉంది. 2025 నాటికి క్షయవిముక్త భారత్ లక్ష్యాన్ని చేరుకుంటాం. అవినీతిని అడ్డుకోవడం ద్వారా 20 బిలియన్ డాలర్లు ఆదా అయింది. భారత్ లానే ఎన్నో దేశాలు అభివృద్ధి కోసం పరుగులు తీస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న ఎన్నో దేశాలకు భారత్ ప్రేరణగా ఉంటోంది. ప్రపంచ మానవాళి ప్రయోజనం దిశగా భారత్ నిరంతర ప్రయత్నం. సరికొత్త విశ్వవేదిక నిర్మించేందుకు భారత్ కృషి చేస్తోందని ఉద్ఘాటించారు. ప్రజా భాగస్వామ్యంతోనే ప్రజా సంక్షేమం అనేది మా విధానం.  సబ్కా  సాథ్.. సబ్కాి వికాస్.. సబ్కాయ విశ్వాస్ మా కొత్త నినాదం. ప్రయత్నం మాది ఫలితం అందరిదీ” అని అన్నారు.

 

 

 

ఉగ్రవాదం గురించి మాట్లాడుతూ.. “శాంతి పరిరక్షణలో భారత్ అందరికంటే ముందుంటుంది. ఇందుకోసం ఎంతోమంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో ముందున్నాం. ఉగ్రవాదం మానవ సమాజానికి సవాల్ విసురుతోంది. ఉగ్రవాదం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోందం”టూ పాకిస్తాన్ ప్రస్తావన లేకుండానే ప్రసంగించారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: