మీరు హైద‌రాబాద్ అమ్మాయా...ఈ వార్త తెలిస్తే....నిజంగా షాక‌వుతారు. ఎందుకంటే...గ‌తంలో గుండె సమస్యలు ఎక్కువగా పెద్దవాళ్లకు అనే ప‌రిస్థితి మారుతోంది.సిటీ యువతుల్లో చాలా మందికి ఇప్పుడిప్పుడే గుండె రోగాలకు సంబంధించిన లక్షణాలు పెరుగుతున్నాయని, త్వరలో ప్రమాదకర స్థాయిలో సమస్యలు వస్తాయని సర్వేలో తేలింది. ‘అసెస్మెంట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎమాంగ్ ఉమెన్ వూ ఆర్ ది ఇండస్ట్రియల్ ఏరియా ఆఫ్ హైదరాబాద్’ పేరుతో డాక్టర్లు చేసిన అధ్యయనంలో ఈ విషయం  వెల్లడైంది.20 నుంచి 30 ఏళ్ల వయసున్న మహిళలు మునుపెన్నడూ లేనట్టు ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడతారని స్ప‌ష్ట‌మైంది.


తాజా స‌ర్వే ప్ర‌కారం, హైదరాబాదీ యువతులు, మహిళలూ రోగాల అంచున ఉన్నారు.  హైబీపీ, ఉబకాయం, మధుమేహానికి కారణమయ్యే మెటబాలిక్‌‌ సిండ్రోమ్‌‌.. 20 నుంచి 30 ఏళ్లున్న సిటీ యువతుల్లో ఎక్కువవుతోంది. ఈ సిండ్రోమే గుండె సమస్యలు, గుండెపోటులకు దారితీస్తుంది. సర్వేలో పాల్గొన్న వారిలో 2.5 శాతం మంది హైరిస్క్‌‌, 3.7 శాతం మంది మధ్యరకం జోన్‌‌లో ఉన్నట్టు తెలిసింది. సిటీ యువతుల్లో 29.7 శాతం మందికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉందని, ఇది పెరిగితే మధ్యరకం జోన్‌‌లో ఉన్న వాళ్లు 12 రెట్లు, హైరిస్క్‌‌ జోన్‌‌లో ఉన్న వాళ్లు 22 రెట్లు పెరుగుతారంది. ఇదే జరిగితే గుండె జబ్బులు సిటీ యువతులను చుట్టుముడతాయని సర్వే హెచ్చరించింది. చిన్న వయసులో ఎక్కువవుతున్నాయని పేర్కొన‌డం సంచ‌ల‌నంగా  మారింది.


కాగా, ఈ వ్యాధుల విష‌యంలో జాగ్ర‌త్త‌ల‌ను సైతం పేర్కొన్నారు. హై బీపీ, ఒబెసిటీ, ఎక్కువ కొవ్వు, పెరిగిన గ్లూకోజ్, నడుము చుట్టుకొలత 80 సెం.మీ కంటే ఎక్కువ లేదా రక్తంలో ఇన్సులిన్‌‌లో పెరుగుదల ఉంటే మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్టని ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ పేర్కొంది. ఈ సిండ్రోమ్‌‌ ఉందటే గుండె జబ్బులు, గుండె పోటులు ఈజీగా వస్తాయి. స్థూలకాయం సమస్య కూడా మెటబాలిక్‌‌ సిండ్రోమ్‌‌కు దారి తీస్తుంది. స్థూలకాయంతో కండరాల నొప్పులు, గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు, షుగర్‌‌, ఉబ్బసం వచ్చే అవకాశాలెక్కువ. అందుకే...బీ కేర్‌ఫుల్ హైద‌రాబాద్ అమ్మాయిలు.


మరింత సమాచారం తెలుసుకోండి: