మిస్ దివా యూనివ‌ర్స్ -2019 కిరీటాన్ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్నోకు చెందిన వ‌ర్తికాసింగ్ ద‌క్కించుకుంది. బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని విజేత‌ను ప్ర‌క‌టించింది. వ‌ర్తికా ప్రొఫెష‌న్ మోడ‌ల్‌తో పాటు ప్ర‌సిద్ధి చెందిన కింగ్‌ఫిష‌ర్ క్యాలెండ‌ర్ గ‌ర్ల్‌గా ప‌నిచేస్తుంది. 2014లో మిస్ ఫొటోజెనిక్ టైటిల్‌తో పాటు 2015లో మిస్ ఫెమినా ఇండియా టైటిల్‌ను కూడా వ‌ర్తికా గెల్చుకుంది.

గతంలో  ప్రియాంక చోప్రాకు మొదటి స్థానం దక్క‌గా. ఇక తర్వాతి స్థానంలో దీపికా పదుకొనే నిలిచింది. మూడో స్థానంలో సన్నీ లియోన్, నాలుగో స్థానంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఐదో స్థానంలో వర్తికా సింగ్, ఆరో స్థానంలో సౌత్ భామ శ్రేయ శరణ్ నిలచింది. శ్రద్ధా కపూర్, కత్రినా కైఫ్, అమీ జాక్సన్, కంగానా రనౌత్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచారు.

మిస్ ఇండియా 2015 గా ఢిల్లీ చెందిన అదితి ఆర్య ఎంపికైంది. ముంబయిలోని యష్ రాజ్ స్టూడియోస్ లో  జరిగిన తుది పోటీల్లో అదితి ప్రధమ స్థానంలో నిలవగా అఫ్రిన్ వాజ్, వర్తికా సింగ్ లు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. పలువురు బాలీవుడ్ నటీనటులు, ప్రముఖ డిజైనర్ లు కార్యక్రమానికి హాజరయ్యారు. ఓ ప్రైవేటు సంస్థలో రీసెర్చ్ ఎనలిస్ట్ గా పనిచేస్తున్న అదితి మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించనున్నారు.

ఎఫ్‌బీబీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ - 2015' పోటీలలో ఢిల్లీ భామ అదితి ఆర్య విజేతగా నిలిచింది. యష్‌రాజ్ స్టూడియోలో కన్నుల పండుగలా జరిగిన ఈ కార్యక్రమంలో అదితి ఆర్య 'మిస్ ఇండియా వరల్డ్' కిరీటాన్ని గెలుచుకుంది.

అఫ్రీన్ రేచల్ వజ్ తొలిరన్నరప్‌గా.. వర్తికా సింగ్ రెండో రన్నరప్‌గా నిలిచారు. శనివారం సాయంత్రం ఇక్కడ ఈ పోటీ జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: