హైకోర్టు చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. నిజానికి కోర్టుల చుట్టూ తిరిగితేనే కానీ  ఏ సమస్య అయినా పరిష్కారం కాదు, ఇపుడు జరుగుతున్నది అందుకు రివర్స్. కోర్టు చుట్టూ కాదు, కోర్టుని పట్టుకుని తిరుగుతున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే అది ఏకంగా కోర్టుని కట్టేసుకుని పట్టుకుపోవడమే. ఏపీలో మూడు ప్రాంతాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనకబాటుకు గురి అయిన ప్రాంతాలు. మరొకటి  కోస్తా ప్రాంతం. ఇక్కడే రాజధానితో పాటు హైకోర్టు అన్నీ ఉన్నాయి.


ఇపుడు హైకోర్టు కోసం మూడు ప్రాంతాలలో ఉద్యమాలు జరుగుతున్నాయి. న్యాయవాదులు విధులను బహిష్కరించి మరీ హైకోర్టు తమ ప్రాంతంలో పెట్టమని కోరుతున్నారు. విశాఖలో హైకోర్టు కావాలని న్యాయవాదులు ఓ వైపు ఆందోళన చేస్తూంటే కర్నూల్లో హైకోర్టు పెట్టాలని మరో వైపు రాయలసీమ న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఇక గుంటూర్లోనే హైకోర్టు ఉండాలని ఆ ప్రాంతం వారు ఉద్యమిస్తున్నారు.


మొత్తానికి హైకోర్టు ఎక్కడ ఉంటుందన్నది ఎవరికీ అర్ధం కావడంలేదు. రాజధాని, హైకోర్టు ఇలాంటి సమస్యలతో ఏపీలో అపుడే నిరసనలు, ప్రాంతీయ వాదాలు మెల్లగా చెలరేగుతున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి హైకోర్టు సీమకు కేటాయించే ప్రతిపాదన  ఉందని బాంబు లాంటి వార్తను చెప్పారు. ఈ విషయం ప్రభుత్వం పరిశీలనలో ఉందని ఆయన చెప్పడం విశేషం. రాష్ట్రంలో అంతటా అభివ్రుధ్ధి చేయాలన్నది తమ ప్రభుత్వ విధానమని కూడా ఆయన చెప్పారు. అన్ని జిల్లాలు సమగ్ర అభివ్రుధ్ధి సాధించాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా ఆయన వెల్లడించారు. మొత్తానికి హైకోర్టు రాయలసీమకు తరలించడం ద్వారా జగన్ సర్కార్ భారీ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసిందని అర్ధమవుతోంది. ముందు హైకోర్టుని కనుక తరలిస్తే రాజధాని విషయంలోనూ ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: