వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1,26,728 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు ఈ నెల 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరిగాయి. 19వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ 30వ తేదీన నియామకపత్రాలను అందించనున్నారు. 
 
విజయవాడలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తొలి నియామక పత్రాన్ని అందిస్తారు. ప్రతి జిల్లాలో ఆ జిల్లాకు చెందిన మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని నియామక పత్రాలు అందిస్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పాల్గొని అక్కడినుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. ప్రతి జిల్లాలోను ప్రత్యేకమైన ఎల్ ఈ డీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ఉద్యోగాలకు ఎంపికైనవారు సీఎం జగన్ ప్రసంగం చూసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
రాతపరీక్షల ద్వారా సచివాలయ ఉద్యోగాలకు ఎంపిక అయినప్పటికీ ఇంకా సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి కాని అభ్యర్థులు ఎవరైనా ఉంటే వారికి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన వెంటనే నియామక పత్రాలు అందిస్తారు. అధికారులు కృష్ణా జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని చెబుతున్నారు. ఈరోజు మిగిలిన జిల్లాల్లో కూడా షార్ట్ లిస్టుల జాబితా పూర్తవుతుందని తెలిపారు. 
 
అధికారులు కేటగిరీ - 1 లో ఎంపికైన అభ్యర్థుల వివరాలు అభ్యర్థులు ధరఖాస్తులో కోరుకున్న మొదటి ప్రాధాన్యత ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపడుతున్నామని అన్నారు. అందువలన జాబితాలను వెల్లడించడానికి ఆలస్యం అవుతున్నట్లు అధికారులు ప్రకటించారు.అక్టోబర్ 2వ తేదీ నుండి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రారంభం కాబోతుంది. అక్టోబర్ 2వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారు విధుల్లో చేరుతారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: