వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి అయ్యాక తాజగా  బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తూ జీవో జారీచేసినట్లు ప్రకటించారు. అయితే దీనిపై టిడిపి పార్టీ నేతలు విమర్శల వర్షం కురిపించారు. బాక్సైడ్ తవ్వకాలను తమ ప్రభుత్వ హయాంలోనే రద్దు చేసామని ఇప్పుడు కొత్తగా జగన్ రద్దు చేయడం ఏంటని వాళ్ళు విమర్శించారు. కాగా టిడిపి నేతల విమర్శలు పై స్పందించిన నగరి ఎమ్మెల్యే రోజా... టిడిపి అధినేత చంద్రబాబు మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఘాటు విమర్శలు చేసారు . 

 

 

 కాగా నగరి ఎమ్మెల్యే,  ఏపీఐఐసి చైర్మన్ రోజా తిరుపతిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టి సి ఎల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో 2, 200  కోట్లతో తిరుపతిలో రెండు కంపెనీలు స్థాపించేందుకు ముందుకు వచ్చిందని రోజా తెలిపారు. ఈ క్రమంలో తిరుపతిలో కంపెనీల ఏర్పాటుకు భూమి పూజ చేసినట్లు తెలిపారు. జగనన్న ఆశీస్సులతో ఏపీ ఐఐసి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాక  మొట్టమొదటి ప్రాజెక్టు కు భూమి పూజ చేయడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఎమ్మెల్యే రోజా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసారు. 

 

 

 అయితే దీనిపై టీడీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. రోజా పోస్ట్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలు వైసిపి ప్రభుత్వ హయాంలో రద్దు చేస్తే టిడిపి హయాంలో రద్దు చేశారని అంటున్నారని టిడిపి అధినేత చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించగా... రోజా విమర్శలకు కౌంటర్ లు ఇస్తున్నారు తెలుగు తమ్ములు. 2018 లోనే చంద్రబాబు హయాంలో తిరుపతిలో టిసిఎల్ కంపెనీ కి పూజ చేస్తే మళ్లీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. జగనన్న ఆశీస్సులతో కాదు చంద్రన్న ఆశీస్సులతో శంకుస్థాపన చేశారు అని చెబితే బాగుంటుందని తెలుగు తమ్ముళ్లు రోజాపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తెలుగు తమ్ముళ్లు విమర్శలపై రోజా ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: