జగన్మోహన్ రెడ్డి నిర్మించిన వాలంటీర్లపై చంద్రబాబునాయుడు తన అక్కసంతా చూపిస్తున్నారు. ఆమధ్యేమో గ్రామ వాలంటీర్లు పెళ్ళి చేసుకోవాలంటే పిల్లను కూడా ఇవ్వరంటూ శాపనార్ధాలు పెట్టారు. తాజాగా వాలంటీర్లు బియ్యం బస్తాలు మోసేటోళ్ళు అంటూ చాలా చులకనగా మాట్లాడారు.  జగన్ ను ముఖ్యమంత్రిగానే అంగీకరించలేకపోతున్న చంద్రబాబు మొదటి నుండి కూడా వైసిపి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా తన ఆలోచనల ప్రకారమే పార్టీని బలోపేతం చేసుకుంటూనే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునేట్లుగానే పాలన సాగించటం సహజం. ఇందుకు జగన్ కూడా మినహాయింపేమీ కాదని గుర్తుంచుకోవాలి. అయితే  తెలుగుదేశంపార్టీ హయాంలోనే ఈ సూత్రం రివర్సయ్యిందంటే అది పూర్తిగా చంద్రబాబు చేతకానితనంగానే చెప్పుకోవాలి.

 

గ్రామ, వార్డు వాలంటీర్లను, గ్రామ సచివాలయాలను నియమిస్తానని జగన్ పాదయాత్రలోనే కాకుండా మ్యానిఫెస్టోలో కూడా స్పష్టం చేశారు. హామీ ఇచ్చినట్లే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పై రెండు క్యాటగిరీల్లో సుమారు 4 లక్షల  పోస్టులు భర్తీ చేసేశారు. సరే అన్ని లక్షల పోస్టులను భర్తీ చేసేటపుడు ఎక్కడైనా తప్పులు జరగటం సహజం. అయితే తప్పులకు బాధ్యులకు గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా జగన్ దే.

 

మొత్తానికి రెండు క్యాటగిరిల పోస్టులను భర్తీ చేయగానే చంద్రబాబు తన అక్కసు వెళ్ళగక్కటం మొదలుపెట్టారు. వాలంటీర్ల పోస్టులకు ఎంపికైన లక్షలాది మంది నిరుద్యోగులపై చాలా చులకనగా కామెంట్లు చేస్తున్నారు. తన హయాంలో నిరుద్యోగులకు ఉపాధిని లేకపోతే ఉద్యోగాలను కల్పించలేకపోయినందుకు చంద్రబాబు సిగ్గుపడాలి. ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు భృతి అంటూ నాటకాలాడి వారిని  సోమరిపోతులుగా ముద్రవేశారు.

 

అలాంటిది జగన్ వారిని సోమరిపోతులను చేయకుండా వారితో ఎంతో కొంత పని చేయిస్తు నెలకింత అని జీతం రూపంలో ఇస్తుంటే చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. మొత్తం మీద జగన్ మీద కోపాన్నంతా చంద్రబాబు గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిపై చూపిస్తున్నట్లు అర్ధమైపోతోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: