పాకిస్తాన్ గత కొంతకాలంగా ఇండియాపై అక్కసు ను వెల్లబోస్తున్నది.  ఎలాగైనా ఇండియాను అంతర్జాతీయంగా దోషిగా నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నది. ఇందులో భాగంగానే ఇటీవల ఇరాన్ లో వ్యాపారం చేసుకుంటున్న కులభూషణ్ ను బంధించి ఉగ్రవాదిగా చిత్రీకరించింది.  అయితే, అంతర్జాతీయ కోర్టు కులభూషణ్ ను నిర్దోషిగా చెప్పినా అతడిని విడిచిపెట్టలేదు.  


ఇప్పటికి అయన పాక్ జైల్లోనే ఉన్నారు.  తాజాగా మరో వ్యక్తిపై కుట్రను మోపాలని చూసింది.  చెన్నై కు చెందిన డి వేణు మాధవ్ అనే ఎలక్ట్రికల్ ఇంజనీర్ 2016లో ఆఫ్ఘన్ లోని దస్థ్ ఏ ఆళ్వాన్ అనే ప్రాంతంలో 500 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకోసం వెళ్లారు.  అంతకు ముందు అయన చెన్నైలో ఇంజనీర్ గా పనిచేశారు.  ఆఫ్ఘన్ లో పనిచేస్తున్న వేణుమాధవ్ ను పట్టుకోవాలని పాక్ చూసింది.  అతనిపై ఉగ్రవాదిగా నేరాలు మోపేందుకు రెడీ అయ్యింది.  


పెషావర్ లో 2015 లో వైమానిక కేంద్రంపై జరిగిన దాడిలో 29 మంది మరణించారు.  అక్కడి ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు.  అనంతరం అక్కడి పెషావర్ సైనిక పాఠశాలలో జరిగిన దాడిలో 132 మంది చిన్నారులు మరణించారు.  ఈ దాడులకు సహాయక సహకారాలు, ఆర్ధికంగా ఉగ్రవాదులకు సహాయం చేశారని వేణుమాధవ్ పై అభియోగాలు మోపి అతడిని ఆఫ్ఘన్ నుంచి కులభూషణ్ మాదిరిగా కిడ్నాప్ చేయాలని చూశారు.  


అయితే, ఈ విషయాన్ని గమనించిన ఇండియా అధికారులను అలర్ట్ చేసింది.  వెంటనే స్పందించిన అధికారులు వేణుమాధవ్ ను ఇండియాకు రప్పించారు.  ఏ మాత్రం ఆలస్యం జరిగినా వేణుమాధవ్ ను ఐఎస్ఐ కిడ్నాప్ చేసి ఉగ్రవాదిగా ముద్రవేసేది.  అయితే, పెషావర్ దాడి జరిగింది 2015లో కాగా వేణుమాధవ్ 2016లో ఆఫ్ఘన్ వెళ్లారు.  2016 వరకు అయన చెన్నైలోనే ఉన్నారు. వేణుమాధవ్ పై కుట్రపన్నుతున్నారన్న విషయం ఇండియాకు ఆలస్యంగా తెలిసింది.  వెంటనే అప్రమత్తం కావడంతో అతడిని ఇండియా రక్షించుకోగలిగింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: