ఇండియా ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది.  ఎవరిపై కూడా అనవసరంగా అభాండాలు వేయడానికి ప్రయత్నం చేయదు.  ఎవరిని అనవసరంగా ఒక ఫ్రేమ్ లో ఇరికించాలని అనుకోదు.  సదా ఎప్పుడు మంచిగా ఆలోచిస్తుంది.  అందుకే ఇండియాలో ఎన్ని గొడవలు ఉన్నా స్వేచ్ఛ ఉంటుంది.  ఇదే విషయాన్ని ప్రధాని మోడీ నిన్నటి రోజున ఐరాస లో మాట్లాడారు.  శాంతి తమ మార్గం అని చెప్పారు.  అశాంతి పూరితమైన ఆలోచనలు చేయదని ఖచ్చితంగా చెప్పారు.  ఇచ్చిన సమయంలోపు ప్రసంగాన్ని ముగించారు.  


ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇండియా ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పిన మోడీ.. పర్యావరణం విషయంలో విశేషమైన కృషి చేస్తున్నట్టు తెలిపారు.  మహాత్ముడి 150 వ జన్మదినం సందర్భంగా ఇండియాను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి బయటపడేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. ఉగ్రవాదం అభివృద్ధికి నిరోధం అని, ఇది ఇండియా ఒక్క సమస్య కాదని ప్రపంచంలోని అన్ని దేశాలు దీన్ని ఎదుర్కొంటున్నాయని అన్నారు.  


అయితే, పాక్ మాత్రం దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది.  15 నిమిషాల సమయం ఇస్తే దానికి నాలుగింతల సమయం ఎక్కువగా తీసుకొని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు.  దాదాపు 50 నిమిషాల పాటు ప్రసంగించారు.  ఈ ప్రసంగం మొత్తం మోడీ, ఇండియా, కాశ్మీర్, మానవహక్కుల ఉల్లంఘన.. ఇవే ఉన్నాయి.  కాశ్మీర్ 80 లక్షల మంది ప్రజలను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని చెప్తున్నారు తప్పించి పాక్ లో ఉన్న విషయాల గురించి  పాక్ లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని అభివృద్ధి ఎలా జరుగుతుంది అని కానీ పేర్కొనడం లేదు.  


పాక్ కు చెందిన మానవహక్కుల సంస్థ సేవ్ కరాచీ పేరుతో ఐరాస బయట డిస్ప్లే లో పాక్ లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనను ప్రస్తావిస్తున్నాయి.  కరాచీని, పాక్ ను కాపాడాలని వేడుకుంటున్న ఆ డిస్ప్లే అందరిని ఆకట్టుకుంది.  కానీ, పాక్ మాత్రం తన కింద ఉన్న నలుపు గురించి పట్టించుకోకుండా పక్క ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలని వాళ్లకు బ్లేమ్ చేయాలని చూస్తున్నది.  ఇది చాలా దారుణమైన విషయంగా చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: