ముక్కుపచ్చలారని చిన్నారులు.కడుపు నొప్పి అంటూ,జ్వరం అంటూ,ఇంకా కారణం మరేదైనా కావచ్చూ,వారి ఒంట్లో కాస్త నలతగా ఉంటే చాలు.తల్లి దండ్రుల ప్రాణాలు విలవిలలాడుతాయి.అయ్యే నా చిన్నారికి ఏమైందో అనుకుంటూ వడివడిగా అస్పత్రికి పరుగెడుతారు.అక్కడ వారు పిల్లల ప్రాణాలను కాపాడొకోవడానికి ఎంత ఖర్చుకైన వెనుకాడరు.ఆస్పత్రిలోని డాక్టర్స్ ఏ మందులు తెమ్మన్ని చీటిలెన్ని ఇచ్చినా,ఓపికగా ఎన్నిసార్లైనా తిరుగుతారు.ఇదంతా దేనికోసం తమ బిడ్డ నిండు నూరెళ్ళూ ఆరోగ్యంగా బ్రతకాలనే ఆశ.అందుకోసం తమ ఆయషును కూడా తీసుకొమ్మని దేవుణ్ని వేడుకుంటారు.



తన పిల్లల ప్రాణాలను కాపాడుకోవడానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయరు.ఇలాంటి సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని అడ్డదారిలో అనవసరమైన ప్రయోగాలతో పసిపిల్లల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు కొందరు వైద్యులు? దయా దాక్షిణ్యం లేకుండా చిన్న పిల్లలను పశువుల్లా భావించి,వారుచేసే నికృష్టపు పనులవల్ల,కన్నవారికి కడుపు కోత మిగులుతుంది!.అసలు వీళ్లంతా వైద్య నిబంధనలనే కాదు.నైతిక విలువలను కూడా తుంగలోకి తొక్కేశారు.వైద్యుడంటే దైవసమానుడన్న విశ్వాసాన్ని తోసిరాసి,రోగుల జీవితాలతో పిల్లల ప్రాణాలతో ఆటలాడుకున్నారు.వీరు చదివిన చదువులకు అర్ధం ఇదేనా!, అందులోని సంస్కారం ఇదేనా!ఈ డాక్టర్ల తల్లిదండ్రులు పెంపకం ఇంత నీచమా!



ఓ డాక్టరు నువ్వు కూడా మనిషివేకదా!నా ప్రాణం నీ ప్రాణం ఒక్కటే కదా మరెందుకు నాకు ఇంత పెద్ద శిక్షవేస్తున్నావు? నీ ప్రయోగాలతో మా ప్రాణాలు ఎందుకు తీస్తున్నావు అని అడగలేక అమాయకంగా చూసే ఆపిల్లల చూపులకు సమాధానం ఏం చెబుతారు?.ఎవరు చెబుతారు?.సమాజమా,చట్టమా!బోసినవ్వుల చాటున బోలెడు బాధలు,ఈవయస్సులో అనుభవించడానికి వారు ఏం పాపం చేసారు?.ఈ పుడమిపై పుట్టడమేనా వారు చేసిన పాపం!..



బాధకలుగుతే దావాఖానకు వెళ్లడమేనా వారి నేరం! లోకజ్ఞానం తెలియని వారు,జ్ఞానాన్ని సంపాదించాం అని అనుకునే అజ్ఞానుల చేతిలో పడి ఎంత నరకాన్ని అనుభవిస్తున్నారో కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు నీలోఫర్ వైద్యులు!దీన్ని నీలోఫర్ అనడం కంటే లోఫర్ అనడం బెటరేమో అని అనుకుంటున్నారు ఈ సంఘటన గురించి తెలిసిన వారు..


మరింత సమాచారం తెలుసుకోండి: