పండుగ సీజన్ వచ్చిందంటే ఆఫర్లే ఆఫర్లు. మాములు సమయంలో 20 వేలు ఉండే వస్తువు కూడా పండుగా సీజన్ లో 10 వేలకి వచ్చేస్తుంది. సరిగ్గా ఇదే తరహాలో ఇప్పుడు మధ్య ప్రదేశ్ లోని టాటా మోటార్స్ డీలర్ కారు కొనుగోలు చేస్తే బైక్ ఉచితంగా అందించే స్కీమ్‌ను తీసుకొచ్చింది. కొత్తగా కారు కొనాలనుకునే వారికీ ఇది శుభవార్తే.        


కారు కొంటె బైక్ ఫ్రీ అంటూ టాటా మోటార్స్ డీలర్ ఈ ఆఫర్ ని అందిస్తుంది. నెక్సన్, టియాగో, టిగోర్ మోడల్స్‌లో ఏం కొన్నా కూడా హోండా స్కూటర్ ఒకటి ఉచితంగా లభిస్తుంది. ఇది ఒక ప్రమోషనల్ ఆఫర్‌. అయితే ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ మాత్రమే కాదండి. టాటా మోటార్స్ పలు మోడళ్లపై రూ.1.5 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందవచ్చట.                               

               

ఈ డిస్కౌంట్ దాదాపు అన్ని డీలర్ల వద్ద అందుబాటులో ఉంది. స్కూటర్ ఆఫర్ మాత్రం మధ్యప్రదేశ్ డీలర్‌ వద్ద మాత్రమే ఉంది. టాటా మోటార్స్ సంస్థతో ఈ స్కూటర్ ఆఫర్‌కు ఎలాంటి సంబంధం లేదు. మాములుగా ఎక్కడైనా డీలర్లు ఉచిత యాక్ససిరీస్, ఫ్రీ ఇన్సూరెన్స్, ఉచిత రిజిస్ట్రేషన్, వార్షిక మెయింటెనెన్స్‌పై డిస్కౌంట్ వంటి పలు ఆఫర్లను కస్టమర్లకు అందిస్తూ ఉంటారు. కానీ గత కొంత కాలంగా ఆటో మొబైల్ పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఇలాంటి భారీ ఆఫర్లు ఇస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు కారు కొనాలనుకునే వారికీ ఇది బంపర్ ఆఫరే.  


మరింత సమాచారం తెలుసుకోండి: