చిన్నపిల్లల దావఖానాగా పేరొందింది నీలోఫర్ ఆస్పత్రి. చిన్న పిల్లల దావఖాన  అంటే చిన్న పిల్లలకు ఎలాంటి వ్యాధి వచ్చినా నయం చేస్తుంది అనుకునేరు...తప్పు తప్పు అదంతా ఒకప్పటి మాట... కానీ ఇప్పుడు  చికిత్స కోసం ఆస్పత్రి లోకి చేరిన  చిన్నపిల్లలు శవమై బయటికి వస్తారు. చిన్న పిల్లలను బతికించడం మానేసి అక్కడి వైద్యులు అందరూ చిన్నపిల్లలని చంపేస్తున్నారు. చిన్న పిల్లల పై ప్రయోగాలు చేస్తూ అభం  శుభం తెలియని చిన్నారులను బలి తీసుకుంటున్నారు అక్కడి వైద్యులు. ముక్కుపచ్చలారని చిన్నారులను ఎంతోమంది మందిని బలితీసుకున్న ఆసుపత్రి వైద్యుల నిర్వాకం... ఆ ఆస్పత్రి లో ఇద్దరు వైద్యులు గొడవ పడడం తో బట్టబయలైంది. 

 

 

 అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ పిల్లలకు ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఆస్పత్రికి పరుగులు తీస్తారు తల్లిదండ్రులు. మామూలు ఆస్పత్రుల్లో అయితే పిల్లలకు సరైన వైద్యం అందించారని  చిన్న పిల్లల హాస్పిటల్ లో అయితే బాగా వైద్యం అందిస్తారని భావిస్తారు. ఐ క్రమంలోనే  చాలా మంది తల్లితండ్రులు తమ పిల్లలకి చిన్న సమస్య వచ్చిన  నిలోఫర్ హాస్పిటల్  తీసుకు వస్తుంటారు... కానీ నిలోఫర్ వైద్యుల రాక్షస బుద్ధి తల్లిదండ్రులకు తెలియదు కదా... చిన్న సమస్య తో వచ్చిన తమ పిల్లలు విగత జీవులుగా బయటకు వెళ్తున్నారు. దీనికి కారణం నీలోఫర్ ఆస్పత్రి వైద్యుల నిర్వాకం. 

 

 

 వివిధ సంస్థల్లో తయారైన మందుల పరీక్షించి పనితీరును తెలుసుకునేందుకు నిలోఫర్ ఆసుపత్రి తీసుకొస్తారు. అయితే నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన చిన్నారులపై అక్కడి వైద్యులు ఆ  మందులను ప్రయోగిస్తారు. చిన్న పిల్లల ఆరోగ్యాన్ని బట్టి మందుల డోసులు పెంచుతారు. దీంతో చాలా మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులు  కనీస మానవత్వం లేకుండా రాక్షసంగా ప్రవర్తిస్తూ చిన్న పిల్లల ప్రాణాలు తీయడం అందరిని కలిచి వేస్తోంది.  నీలోఫర్ ఆసుపత్రి కి తమ పిల్లలను తీసుకు వచ్చిన తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగులుస్తుంది  నిలోఫర్ ఆసుపత్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: