డబ్బుకు లోకం దాసోహం అనమాట వూరికే రాలేదనిపిస్తుంది.ఇప్పుడు హస్పిటల్స్‌లో జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే. ఎంత డబ్బున్న ఇంకా ఇంకా కావాలనే ఆశ కొందరిలో కలుగుతుంది.అందుకే వీపరిత బుద్దులే వినాశనంకు దారి తీస్తాయి. మానవ వినాశనానికి కారణమయ్యె జ్ణానంకన్న,మానవ జాతిని కాపాడే దయా గుణమే మిన్న.ఇది ఈనాటి వైద్యుల్లో లోపిస్తుంది. ఒక వ్యక్తికి ఇంత అనే పరిమితి ఉంటుంది.ఆ పరిమితి దాటి ప్రవర్తిస్తే చిన్న పిల్లలు అయినా సరే దండనకు గురి కాక తప్పదు! మరి ఇప్పుడు నీలోఫర్లో జరుగుతున్న దుష్టచర్యలకు ఎంత పెద్ద శిక్షలు వేస్తారో!.



వైద్య పరిజ్ణానమ్ అనేది ఎంతో మంది మహానుబావుల నిస్వార్ద త్యాగ ఫలం.దానిని కోట్లు పెట్టి కొనుక్కోవడమనేది అజ్ఞానపు అలోచన.ఆ పెట్టిన కోట్లను ప్రజల రక్తాలనుపీల్చి, ప్రాణాలను హరించి సంపాధించడం కంటే దరిద్రమైన బ్రతుకు మరోటి వుంటుందా!. ప్రజలకు నిస్వార్దంగా వైద్యసేవలు అందించే గుణం లేని వారు వైద్యులుగా అనర్హులు. మన  జాతి  దౌర్బాగ్యం కొద్ది వైద్యం వ్యాపారం అయి ఉండవచ్చు.కాని వైద్యులు"సొంత లాభం కొంత మానుకోక పోతే "మన సమాజం లోని పేద ప్రజలు బ్రతికే పరిస్ధితి లేదు.వారి కోసమే మన పూర్వికులు మనకు వైద్య విజ్ఞానం అందించారు తప్పా,మీరు వ్యాపారం చేసుకోవడానికి కాదు..వెలకట్టలేనిది వైద్య విద్య,మరి అటువంటి వైద్య విద్య వృత్తిలో వుండి సమాజం సిగ్గుపడేలా.వీడు మావాడు అని తల్లిదండ్రులు చెప్పుకోవడానికి సంకోచించేలా ప్రవర్తిస్తున్నారు కొందరు డాక్టర్స్ !..



ఇక కొన్ని సినిమాల్లో చూపించినట్టే మానవత్వం మరిచిన నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు ఆస్పత్రికి వచ్చే చిన్న పిల్లల పై క్లినికల్ ట్రయల్స్ చేసి చేయకూడని దారుణాలు చేస్తున్నారు.కార్పొరేట్ మందులు సరిగా పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి కొందరు నీలోఫర్ ఆస్పత్రి వైద్యులకు భారీగా డబ్బు ఆశచూపి చిన్నపిల్లలకు ఆ మందులతో వైద్యం చేయిస్తున్నారు.ఎంతో కలత కలిగిస్తు,కలకలం సృష్టిస్తున్న ఈ నిజం,నిజంగా అబద్ధమైతే బాగుండును.నీలోఫర్ ఆస్పత్రిలో డాక్టర్లు చేస్తున్న ఈ దందా డాక్టర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకోక పోతే బయటకు వచ్చేదికాదు.ఇది బయటకు తెలియకుంటే ఇంకా ఎన్ని దారుణాలు జరిగేవో, ఎంత మందికి కడుపుకోత మిగిలేదో అని ఇప్పటికే ఈ క్లినికల్ ట్రయల్స్ బారిన పడిన చిన్నారుల తల్లిదండ్రులు వేదన చెందుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: