వైద్యులంటే దేవుళ్లతో అలానే వైద్యశాల అంటే దేవాలయంతో సమానం అని మన పెద్దలు అంటుంటారు. మనకు కలిగిన ఆరోగ్య సమస్య కు చికిత్స కోసం వైద్యుని వద్దకు వెళితే, వారు మనల్ని పరీక్షించి దానిని నయం చేయడం కోసం మందులు ఇచ్చి వారు మన ఆరోగ్య సమస్యను తగ్గిస్తారు. మరి ఆ విధంగా మన ప్రాణాలను కాపాడవలసిన దైవాల వంటి డాక్టర్లే నిర్దాక్షిణ్యంగా మన ప్రాణాలను హరిస్తుంటే ఇక ఎవరితో చెప్పుకోవాలి. ఇక అసలు విషయం ఏంటంటే పాలుగారే పసిబిడ్డల పై జాలి, దయ, కరుణ వంటివి ఏ మాత్రం లేకుండా హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు అడ్డగోలుగా, యథేచ్ఛగా తమ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే చిన్నారులపై పలు రకాల అనుమతులు లేని క్లినికల్ ట్రైల్స్ నిర్వహిస్తూ వారి ప్రాణాలను బలిగొటున్న వార్త నేడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తోంది. 

అయితే దీనిపై స్వయంగా ఆసుపత్రి సిబ్బంది కొందరు అది నిజమే అని ఒప్పుకుంటుంటే, మరికొందరు మాత్రం బుకాయిస్తూ అటువంటిది ఏమి లేదు, అవన్నీ తమ ఆసుపత్రి ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు చేస్తున్న కుట్ర అంటూ కొట్టిపారేస్తున్నారు. అయితే ఇప్పటికే అనధికారికముగా కొందరు పసిబిడ్డలపై క్లినికల్ ట్రైల్స్ నిర్వహించడంతో వారు ప్రాణాలు కోల్పోయారని, ఆ బిడ్డలను కన్న తల్లితండ్రులు చివరకు విషయాన్ని తెలుసుకుని ఆసుపత్రిపై ఆందోళనకు సిద్దమైనట్లు సమాచారం. నిజానికి ఎవరిమీదైనా అటువంటి ఔషధ సహిత క్లినికల్ ట్రైల్స్ నిర్వహించాలంటే తప్పనిసరిగా ముందుగా ప్రభుత్వ అనుమతి ఉండాలి, 

ఆ తరువాత ఎవరిమీదనైతే ఆ ప్రయోగాలు నిర్వహిస్తున్నారో వారి నుండి కూడా పూర్తి అనుమతి తీసుకుని, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా తెలియచేసిన తరువాతనే అవి నిర్వహించాలి. అదికాక, ఒకవేళ అవి మరేవైనా సమస్యలకు దారితీసి ఆ వ్యక్తి మరణిస్తే, వారికి తప్పనిసరిగా ఇన్సూరెన్సు కింద కొంత మొత్తాన్ని అందించాలి. కానీ ఇవన్నీ ఏ మాత్రం పట్టించుకోకుండా, పూర్తిగా పెడచెవిన పెట్టి, తమ ఇష్టానుసారం, యధేచ్చగా త్రుచ్ఛమైన డబ్బుకోసం నీలోఫర్ ఆసుపత్రి వైద్యుల ఈ దాష్టీకాన్ని పలువురు ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ, ఆ ఆసుపత్రిపై అలానే అందులోని వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: