పాకిస్తాన్ ఐరాసలో మరోసారి తన కపటబుద్దిని చాటుకుంది. ప్రపంచంలో ఉగ్రవాదం పెరిగిపోతోందని, ఉగ్రవాదం రూపుమాపేందుకు ప్రపంచ దేశాలన్నీ ఒక్కటి కావాలని, అప్పుడే శాంతియుతమైన వాతావరణం నెలకొంటుందని, అభివృద్ధి శాంతి రెండు రెండు కళ్ళ వంటివి అని ఇప్పటికే ప్రధాని మోడీ ఐరాసలో పేర్కొన్నారు.  ఐరాసలో మొదట ప్రధాని మోడీ మాట్లాడారు.  అనంతరం ఇమ్రాన్ ఖాన్ ఏకంగా 50 నిమిషాలపాటు ప్రసంగించారు.  


ఈ ప్రసంగం ఇండియా, కాశ్మీర్, ఇండియాలో ఉగ్రవాదులు, రక్తపాతం వంటి అంశాల చుట్టూనే తిరిగింది. కాశ్మీర్ ను ఇండియా నుంచి విముక్తి కల్పించడానికి ఆ దేశంతో యుద్దానికి సైతం సిద్ధం అని మాట్లాడారు.  ఇండియా దేశంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడితే.. పాక్ మాత్రం తన దేశం గురించి మాట్లాడకుండా పక్క దేశం ఇండియా గురించి ఇండియాపై యుద్ధం గురించి మాట్లాడింది.  దీంతో సభ్యదేశాలకు పాక్ ఏం మాట్లాడుతుందో తెలియక ఆశ్చర్యపోయారు.  


ఇక పాక్ ప్రధాని ప్రసంగం అనంతరం ఐరాసలో ఇండియా ప్రతినిధి విదిషా మైత్ర రిప్లయ్ ఇచ్చారు.  రైట్ టు రిప్లై ఆప్షన్ ను వినియోగించుకోవడం ద్వారా ఈ రిప్లై ఇచ్చారు.  ఇమ్రాన్‌ఖాన్‌ 21వ శతాబ్దంలో ఉంటూ ఇంకా మధ్యయుగం నాటి వ్యక్తిలా ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. అణుయుద్ధం జరగాలని ఆయన కోరుకుంటుండటాన్ని బట్టి  దుర్మార్గపు ఆలోచనలు బయటపడుతోందని తెలిపారు.  ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదులుగా గుర్తించిన 130 మందితోపాటూ, 25 ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్‌లో లేవా? అని ప్రశ్నించారు. ఐరాసకు చెందిన ప్రతినిధులను పాక్ లోకి అనుమతించాలని తద్వారా అక్కడ జరుగుతున్న హింసను, ఉగ్రవాదుల కార్యకలాపాలను తెలుసుకోవాలని అన్నారు.  


ఇండియా ఇచ్చిన రిప్లై కు పాక్ దిమ్మతిరిగిపోయింది.  ఇప్పటి వరకు ఆ దేశం నుంచి ఎలాంటి రిప్లై రాలేదు.  యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని పాక్ పదేపదే చెప్తున్నది.  అందుకు భారత్ కూడా సిద్ధంగా ఉంది.  యుద్ధంకాదు.. బుద్దితో ఉండటమే ముఖ్యం అని ఇప్పటికే ఇండియా పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.  కానీ, పాక్ యుద్ధమే కోరుకొని అడుగు ముందుకు కేస్తే.. దాని పర్యవసానం ఎలా ఉంటుందో పాక్ కు బాగా తెలుసు.  చైనా అండతో రెచ్చిపోతున్న పాక్ కు యుద్ధం వస్తే ఆ చైనా కూడా సహాయం చేయదు.  ఇండియాలో ముస్లిం గురించి మాట్లాడుతున్న పాక్.. చైనాలో ముస్లింలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడదు.  చైనా అధీనంలో ఉన్న హాంకాంగ్ లో జరుగుతున్న మానవహక్కుల గురించి కూడా మాట్లాడదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: