ఇదే విషయాన్ని పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. తెలుగుదేశంపార్టీ హయాంలో నియమితులైన వాళ్ళు ఇంకా ఆ పదవులను పట్టుకుని వేలాడుతున్నా పట్టించుకునేంత తీరిక కూడా ప్రభుత్వానికి లేదా ? అని నేతలు ఆశ్చర్యపోతున్నారు.  ప్రపంచానికే రోజు బుద్దులు, నైతిక విలువలు చెప్పే టిడిపి నేత వర్ల రామయ్య ఆర్టీసీ ఛైర్మన్ గా ఇంకా కంటిన్యు అవుతుండటమే విచిత్రంగా ఉంది.

 

నిజానికి ప్రభుత్వం ఘోరంగా ఓడిపోగానే నైతిక విలువలు ఉన్న నేతలైతే ప్రభుత్వం ద్వారా  తమకు సంక్రమించిన  పదవులకు వెంటనే రాజీనామాలు చేసేస్తారు. అయితే వర్లకు అటువంటిదేమీ ఉన్నట్లు లేదు. అంటే ఇటువంటి వాళ్ళు ఇంకా కొందరున్నట్లు తెలుస్తోంది. టిడిపి ప్రభుత్వం ఓడిపోయి నాలుగు నెలలవుతున్నా ఇంకా తమ పదవులను పట్టుకుని వేలాడుతునే ఉన్నారు.

 

వర్ల ఛైర్మన్ పదవిలో నియమితులయ్యిందే ఏడాది కాలానికి. ఆ యేడాదిపదవి కూడా అయిపోయింది. అందులోను ప్రభుత్వం పడిపోయే నూరు రోజులు దాటింది. అయినా ఛైర్మన్ పదవికి రాజీనామా చేయకుండా ఇంకా వేలాడుతునే ఉన్నారు. ఆ పదవి ద్వారా సంక్రమించే సౌకర్యాలు వాడుకుంటు, జీత బత్యాలు తీసుకుంటున్నారు. అంటే ప్రభుత్వంలో భాగంగా కంటిన్యు అవుతునే జగన్మోహన్ రెడ్డిని దారుణంగా విమర్శిస్తు, ఆరోపణలు చేస్తుండటమే విచిత్రంగా  ఉంది.

 

సరే ఈయనకంటే రాజీనామా చేయాలని లేదు కాబట్టి కంటిన్యు అవుతున్నారు. మరి ప్రభుత్వానికి ఏమైంది ? ప్రభుత్వమన్నా చూసుకోవద్దా ? టిడిపి హయాంలో నియమితులైన ఛైర్మన్లు, జోనల్ ఛైర్మన్లు ఎవరు ? ఇంకా ఇతర పదవుల్లో కంటిన్యు అవుతున్నవారెవరు ? అనే విషయాలను చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

 

నాలుగు నెలలైనా చూసుకోలేదంటే జగన్ ప్రభుత్వం కూడా గుడ్డిగా ఎలా పనిచేస్తోందో అర్ధం కావటం లేదు.  నిజానికి నాలుగు నెలల క్రితమే వారంతట వారుగా తప్పుకునుంటే అటు వ్యక్తులకు ఇటు కొత్త ప్రభుత్వానికి ఎంతో గౌరవంగా ఉండేది. అలా కాదని కొత్త ప్రభుత్వం తీసేసేంత వరకు తెచ్చుకుంటున్నారంటేనే .....


మరింత సమాచారం తెలుసుకోండి: