ఈ సృష్టిలో పూర్తిగా ప్రకృతితో ముడిపడిన అద్భుతమైన పండుగ బతుకమ్మ.ఈ బతుకమ్మ ఉత్సవాలు దసరా నవరాత్రుల సమయంలోనే ప్రారంభమవుతాయి.ఇక ఈ బతుకమ్మను గునుక, తంగేడు పువ్వులు,ఇంకా అన్నిరకాల ఇతర పుష్పాలతో బతుకమ్మను పేర్చి పూజిస్తారు.బతుకమ్మ ఆటలో మహిళలు,ఆడ పిల్లలు అందరూ ఒక చోట చేరి బతుకమ్మ పాటలు పాడి పూజలు చేస్తారు.ఆ తర్వాత వాయినాల్లో బెల్లం,సజ్జలు,పప్పు ధాన్యాలు కలిపి ప్రసాదంగా ఇస్తారు.ఇలా ఇచ్చే ప్రసాదంలో ఎన్నోరకాలైన పోషకాలుంటాయి..



ఇక తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాల్ని ఈ పండుగ తెలియజేస్తుంది.నిజానికి ఈ పండుగకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. కాకతీయుల కాలం నుంచే బతుకమ్మను జరుపు కుంటున్నట్లు ఆధారాలున్నాయి.ఇది ఈనాటి పండుగ కాదని చెబుతారు.ఇకపోతే బతుకమ్మను ముస్తాబు చేసే విధానం.ఒక పళ్లెంలో గుమ్మడి ఆకులు పరిచి వాటిని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు.ముందుగా గుమ్మడి పువ్వుల్ని అమర్చి అక్కడే తంగేడు, బీర,గన్నేరు,నిత్యమల్లె,బంతిపూలను ఒక్కో వరుసలో ఉంచుతారు.



ఇలా ప్రకృతి నుంచి ప్రత్యక్షమయ్యే పూలమాత బతుకమ్మ.ఎనిమిది రోజులపాటూ అమ్మవారికి పూజలు చేసిన తర్వాత తొమ్మిదో రోజు అష్టమినాడు జరిగే సద్దుల బతుకమ్మకు భారీ ఎత్తున పూజలు చేసి పత్రితో సహా నిమజ్జనం చేస్తారు.బతుకమ్మ పూలు,పత్రిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి.అవి చెరువుల్లోని నీటిలో కలుస్తాయి.అలా కలిసిన నీరు పొలాలకు వెళ్తుంది.ఆ నీటిలో ఔషధ గుణాల వల్ల క్రిములు నశించి పంట పొలాలు చక్కగా పెరుగుతాయి.



తద్వారా ప్రతి ఇల్లు ఆరోగ్యం,కరుణ కటాక్షాలతో వర్ధిల్లుతుంది.ఇదే బతుకమ్మ పండుగలో ఔన్నత్యం.ప్రస్తుతం బతుకమ్మ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.అందుకే హైదరాబాద్‌ ఎల్బీనగర్ స్టేడియం వేదికగా నిర్వహించిన మహా బతుకమ్మ ఉత్సవాలు గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డులకు ఎక్కాయి.తెలగాణరాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.ఏటా ఆడపడుచులకు ప్రత్యేకంగా బతుకమ్మ చీరలు ఉచితంగా అందిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: