రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇరు రాష్ట్రాలు ప్రయోజనాల కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు తరచూ భేటీ అవుతూ పరిష్కార మార్గాలు వెతుక్కుంటూ ముందుకు సాగుతున్నారు. విభజన సమస్యలతోపాటు కేంద్ర రాజకీయాల పైన ఇద్దరు సీఎంలు కలిసి చర్చించుకుంటున్నారు. రాజకీయంగా ఒకరికొకరు  ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు.

గత ఎన్నికల్లో ఏపీలో వైస్సార్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కెసిఆర్ జగన్ కు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాడు. ఏదైతేనేం తెలంగాణలో టిఆర్ఎస్, ఏపీలో వైసిపి అధికారంలోకి రావడంతో ఇరుపార్టీల మధ్య స్నేహ పూర్వక వాతావరణం నెలకొంది. కానీ ఈ రెండు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఇంతగా కలిసిమెలిసి ఉండడం వెనుక ఎవరున్నారు అనే సందేహం చాలామందిలోఉంది. 

ఆ అదృశ్య శక్తే ఈ ఇద్దరినీ ముందుకు నడిపిస్తోందని కూడా చాల కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.ఆ అదృశ్య శక్తి మరెవరో కాదు  వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి ఆత్మీయుడిగా పేరొందిన కెవిపి రామచంద్ర రావు. చివరకు పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ ఫార్ములా విజయవంతం కావడానికి కారణం కూడా ఈయనే.ప్రాజెక్ట్ పనులను  12.5% తక్కువకు కోడ్ చేస్తూ మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ బిడ్ దాఖలు చేసింది. ఈ విధానం ద్వారా ప్రభుత్వ ఖజానాకు 782 కోట్లు ఆదా అయిన సంగతి తెలిసిందే. మరో షాకింగ్ విషయం ఏంటి అంటే తెలంగాణ కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నది కూడా ఇదే మెగా ఇంజినీరింగ్ కంపెనీ.

అసలు ఈ ప్రాజెక్టు ఈ సంస్థకు దక్కడం వెనుక కెవిపి రామచంద్ర రావు కీలక పాత్ర పోషించినట్టు వెల్లడైయుండి.ఎందుకంటే మేఘ కంపెనీలో కెవిపికి కూడా షేర్ షేర్లు ఉన్నట్టు సమాచారం. మేఘా కు పోలవరం ప్రాజెక్ట్ దక్కే విషయంలో అటు జగన్, ఇటు మేఘను ఒప్పించడం లో కెవిపి పూర్తిగా సఫలం అయ్యారు. అయితే కేవీపీ మాత్రం ఎక్కడా తాను ఫోకస్ అవ్వకుండా తెర వెనుక ఉండి ఈ వ్యవహారాలను చక్కబెడుతున్నాడట.ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.


    మరింత సమాచారం తెలుసుకోండి: