రోజుకు కనీసం ఒక్కసారైనా టీ తాగేవారు చాలా మందే ఉంటారు. కొందరు ఉదయం సాయంత్రం రెండు పూటలా టీ తాగుతారు. టీ తాగటం వలన చురుగ్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టీ టెన్షన్ ను తగ్గిస్తుంది. టీ తాగటం వలన ఎలాంటి నష్టం లేదు కానీ టీ బ్యాగు ఉపయోగించి టీ తాగితే మాత్రం మీ ఆరోగ్యం డేంజర్ లో ఉన్నట్లే అని చెప్పవచ్చు. విషకరమైన ప్లాస్టిక్ ను ఉపయోగించి టీ బ్యాగులను తయారు చేస్తున్నారు. 
 
ఈ విషయం గురించి అమెరికా హెల్త్ జర్నల్ తాజా అధ్యయనంలో ప్రచురించింది. అమెరికాకు చెందిన నటాలీ టు ఫెంక్జీ అనే మహిళ ఒకరోజు కెఫేకు వెళ్లి టీ ఆర్డర్ చేసింది. నటాలీ వేడి వేడిగా ఉన్న టీని తన చేతిలోకి తీసుకున్న సమయంలో తన కళ్లు టీ బ్యాగు మీద పడ్డాయి. టీ బ్యాగును ప్లాస్టిక్ తో తయారు చేశారేమో అన్న అనుమానం నటాలీకు కలిగింది. వెంటనే నటాలీ కొన్ని టీ బ్యాగులను వేరు వేరు దుకాణాల నుండి కొనుగోలు చేసి పరిశోధనలు ప్రారంభించింది. 
 
నటాలీ ఒక కప్పు తీసుకొని కప్పులో వేడి నీటిని ఉంచింది. కొనుగోలు చేసిన ఒక టీ బ్యాగును వేడి నీటిలో ఉంచగా టీ బ్యాగు నుండి ప్లాస్టిక్ రేణువులు విడుదల కావటం నటాలీ గమనించింది. 3 మిలియన్ల నానో ప్లాస్టిక్ కణాలు, 11 బిలియన్ల మైక్రో ప్లాస్టిక్ కణాలు విడుదల అవుతున్నాయని గుర్తించింది నటాలీ. ఈ అధ్యయనం పూర్తయిన తరువాత నటాలీ టీ వలన ఎలాంటి సమస్య లేదని కానీ టీ బ్యాగుల నుండి మాత్రం ప్లాస్టిక్ వస్తుందని తెలిపింది. 
 
టీ బ్యాగులు ఉపయోగించి టీ తాగటం వలన కొన్ని బిలియన్ ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి చేరుతాయి. టీ బ్యాగుల నుండి విడుదలయ్యే ప్లాస్టిక్ కణాలు ఎంత చిన్నగా ఉంటాయంటే అవి శరీరంలోని కణాల లోపలికి కూడా చొచ్చుకొనివెళ్లగలవు. ప్లాస్టిక్ మనుషుల శరీరంలోకి వెళితే అది మనుషుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. తద్వారా అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: