పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్   నోరుజారడం పరిపాటిగా మారినట్టుంది. ఐక్యరాజ్యసమితి 74వ సర్వప్రతినిధుల సభలో శుక్రవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం తర్వాత పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రసంగించారు.ఇచ్చిన సమయాని కంటే ఎక్కువ సమయం  ప్రసంగించిన ఇమ్రాన్  ఖాన్ మళ్ళి నోరు జారారు. ఓ సందర్భంలో నరేంద్ర మోదీని భారత రాష్ట్రపతిగా పేర్కొన్నారు.
ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీతో కలసి ఏప్రిల్లో ఇచ్చిన సంయుక్త మీడియా సమావేశంలోనూ ఇదే తరహాలో మాట్లాడి నాలుక కరుచుకున్నారు. జర్మనీ, ఫ్రాన్స్కు బదులు జర్మనీ, జపాన్ రెండూ సరిహద్దును పంచుకుంటున్నాయన్నారు ఇమ్రాన్. 

ఈ వీడియో అప్పుడు విపరీతంగా ట్రోల్ చేసారు నెటిజన్లు.కాగా ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్లను తమ గగనతలంలోకి ప్రవేశించకుండా మరోసారి పూర్తి స్థాయిలో నిషేధం ప్రకటించింది పాకిస్థాన్.
 కరాచీలోని మూడు గగనతల మార్గాలను ఆగస్టు 28 నుంచి 31 వరకు మూసేయ్యాలని నిర్ణయం తీసుకుంది. 

ఈ నిషేధం కారణంగా అంతర్జాతీయ విమానయాన రంగంపై ప్రభావం పడనుంది. అందుకు బదులుగా పైలట్లకు ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచిస్తోంది పాక్.పాకిస్థాన్ రోడ్డు, గగనతల మార్గాల నుంచి... అఫ్గానిస్థాన్తో భారత్ వాణిజ్య సంబంధాలను నిలిపేయాలనే ఆలోచనతో పాకిస్థాన్ కేబినెట్ భేటీ అయ్యింది. ఇమ్రాన్ భారత్ను.. పాక్ గగనతలంలోకి పూర్తిగా నిషేధించేందుకు యోచిస్తున్నారని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఫవాద్ చౌదరి ఇప్పటికే ట్వీట్ చేశారు.

బాలాకోట్ నుంచి మొదలైంది..బాలాకోట్ ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన దాడి చేసిన తర్వాత ఫిబ్రవరిలో వాయు మార్గాన్ని నిలిపేసినట్లు పాక్ ప్రకటించింది. ఆ తర్వాత మే 15 నుంచి మరో 15 రోజులుపాటు ఈ నిషేధాన్ని కొనసాగించింది.ఆర్టికల్ 370 రద్దుతో పరిస్థితులు మరింత ఉద్ధృతంగా మారుతుండగా భారత్తో  దౌత్య, వాణిజ్య సంబంధాలను పాక్ తెంచుకుంది. ఇప్పటికే బస్సు, రైలు సర్వీసులను కూడా ఇప్పటికే   రద్దు చేసింది పాక్ ప్రభత్వం.


మరింత సమాచారం తెలుసుకోండి: