సెక్స్‌ అనేది తాత్కాలిక సంతోషాన్నిచ్చే చర్య కాదు.శాశ్వత ఆరోగ్నాన్ని అందించే సాధనం.యవ్వనంగా కనిపించాలన్నా, వ్యాధులతో పోరాడే శక్తి సమకూరాలన్నా,నొప్పులు తగ్గాలన్నా శృంగారంలో తరచుగా పాల్గొనాలి.అది కట్టుకున్న భార్యతో అయితే చాల మంచిది.కాని ఈ కాలంలో శృంగారం అనేది నోట్లో చాక్లెట్లా సినిమా టికిట్‌లా అయ్యింది. ఎక్కడపడితే అక్కడ. ఎవరితో పడితే వారితో,విచ్చలవిడిగా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం శృంగారంలో మునిగి తేలడం.ఇది ఈ నాటి సెక్స్ భాగోతం.ఈ విచ్చలవిడి సెక్స్ వల్ల రోగాలు రావడం,సెక్స్ కోసం మనుషులు కుక్కల్లా కరచుకోవడం చివరకు ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుంది.



దీనిపై ఏదేశం ఇప్పటివరకు నోరు మెదపలేకపోతుంది.కాని ఇండోనేషియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెరపైకి తెచ్చింది.ఇకపై ఎవరైనా పెళ్లికి ముందే తొందరపడితే జైలు ఊచలు లెక్కిస్తారని హెచ్చరించింది.ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లితే..ఒకప్పుడు పెళ్లి తర్వాతే అన్నీ అదించే వారు.కానీ,ఇప్పుడు సహ జీవనం పేరుతో పెళ్లికి ముందే కొందరు కొత్త కొత్త సెక్స్ రుచులను,రుచి చూస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇండోనేషియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెరపైకి తెచ్చింది.ఇకపై ఎవరైనా పెళ్లికి ముందు పడక సుఖాన్ని అనుభవిస్తే జైలు ఊచలు లెక్కిస్తారని హెచ్చరించింది.దీంతో అక్కడి ప్రజలు తలలు బాదుకుంటూ ఆగ్రహంతో ఊగిపోతూ పార్లమెంటును ముట్టడించారట.



ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆ దేశ రాజధాని జ‌క‌ర్తాతో పాటు చుట్టుపక్కలి నగరాల్లో నిరసనలు హోరెత్తుత్తున్నాయట.వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారట..కాదా మరి రుచులు మరిగిన నాలుక కు పచ్చడిమెతుకులు ఏం సరిపోతాయి.కాని ఈ బిల్లును గనుక పార్లమెంటు ఆమోదిస్తే అబార్షన్లు తగ్గి,విచ్చలవిడి శృంగారానికి అడ్డుకట్ట పడుతుందని అక్కడి ప్రభుత్వం ఆశిస్తుందట.ఇక మన దగ్గర వాహనదారులకు కొత్తచట్టం తెచ్చి,ఇది ప్రజలు కోసమే తెచ్చిన చట్టం అని చెప్పినట్లు,అక్కడి ప్రభుత్వంకూడా ఇది ప్రజలుఆరోగ్యంగా ఉండటం కోసమే ఈ చట్టంఅని చెబుతున్నా రట.ఏది ఏమైన హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడుపుతాడు కాని,శృంగారం లేకుండా రసిక ప్రియులు వుంటారా చెప్పండని అంటున్నారట కొత్తరుచులకు మరిగిన రంకు మనుషులు.



ఇక అక్కడి పార్లమెంట్‌లో పెట్టిన బిల్లులో ఉన్న విషయాలను ఓ సారి పరిశీలిస్తే.పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొనే జంటకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తారు..వివాహేత‌ర సంబంధం పెట్టుకుంటే ఆరు నెలలు జైలు శిక్ష..అబార్షన్ చేయించుకునే మహిళలకు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తారు..ఇక అత్యాచార బాధితులకు,మెడికల్ ఎమర్జెన్సీ బాధితులకు మాత్రం అబార్షన్ల నుంచి మినహాయింపు ఉంటుందట.నిజం చెప్పమంటే ఈ చట్టం చాలా బాగుంది.మన వాహన చట్టం కంటే.కాని దీన్ని ప్రపంచం అంతటా అమలుచేస్తే బాగుంటుంది కదా.ఎయ్ మతి వుండే మాట్లాడుతున్నావా అని అంటారేమో ఇది గనుక జరిగితే ప్రపంచ యుద్ధమే వస్తుంది అంటున్నారు అందరు..


మరింత సమాచారం తెలుసుకోండి: