రోగికి ప్రాణం పోయాల్సిన డాక్టర్లే అదే రోగులను తమ ప్రయోగాల కోసం వాడుకుని చంపేస్తుంటే ఇక ఎవరు దిక్కు, ప్రజలు ఎవరికి తమ ఆరోగ్య సమస్యలు చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న పరిస్థితి హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో జరుగుతోంది. కొన్నాళ్ల నుండి అక్కడికి వైద్యం చేయించుకోవడానికి వచ్చే అభం, శుభం తెలియని చిన్నారులను తమ ప్రయోగాల కోసం క్లినికల్ ట్రైల్స్ చేస్తూ చిన్నారుల విలువైన ప్రాణాలను బలిగొంటున్నారు వైద్యులు. గత కొద్దిరోజలుగా ఎంతో గుట్టుచేప్పుడు కాకుండా జరుగుతున్న ఈ తంతు, నేడు హఠాత్తుగా బయటకు రావడంతో, పలువురు ప్రజలు, ప్రజా సంఘాలు నీలోఫర్ ఆసుపత్రి పై విమర్శలు గుప్పిస్తున్నారు. చిన్నారులపై ప్రయోగాలు చేస్తున్న డాక్టర్ల పై కఠన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

అయితే, నీలోఫర్ ఆస్పత్రి లోని కొందరు డాక్టర్ల వాదన మరోలా ఉంది. ఆస్పత్రిలో ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ జరగడం లేదని అదంతా ఒట్టి పుకారేనని వారు స్పష్టం చేస్తున్నారు. చిన్నారులు ఆస్పత్రికి వచ్చిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు తమ సంక్షరక్షణలోనే ఉంటారని, తమ ప్రమేయం లేకుండా ఆస్పత్రిలో ఏమీ జరగదని, కొందరు కావాలనే పని గట్టుకుని తమ ఆసుపత్రి ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర పన్నుతున్నారని వారు చెప్తున్నారు. అయితే తమ చిన్నారులకు చికిత్స నిమిత్తం నీల్ఫేర్ కు వచ్చే కొందరు తల్లితండ్రులు చెప్తున్న వివరాలను బట్టి, ఇక్కడకు వస్తున్న వారిలో అత్యవసర సమయంలో ఆస్పత్రికి వచ్చిన చిన్నారులకు డాక్టర్లు ఎటువంటి మందులు ఇస్తున్నారో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. దీంతో చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నారని ఆరోపించారు. ఎంతో అనుభవం, ప్రతిభ గల ఇక్కడి డాక్టర్లు చికిత్స పేరుతో తమ చిన్నారుల ప్రాణాలు బలిగొనడం దారుణమని వారు వాపోతున్నారు. 

అయితే క్లినికల్ ట్రైల్స్ కోసం తమ ఆసుపత్రికి చాలా కంపెనీలకు సంబంధించి ఇప్పటివరకు ప్రయోగాలు తాము ఎథిక్ కమిటీ అనుమతితో చేశామని, అయితే ఇప్పటి వరకు తమకు ఎలాంటి అవరోధలు రాలేదని, ఏ చిన్నారి మీద అయినా క్లినికల్ ట్రయల్స్ చేయవలసి వస్తే, వారి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకుని మాత్రమే చేస్తున్నామని అంటోంది అక్కడి కొందరు డాక్టర్ల బృందం. కాగా ఈ తాజా వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం నీలోఫర్ ఆసుపత్రి పై క్లినికల్ ట్రైల్స్ విషయమై నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది......!!


మరింత సమాచారం తెలుసుకోండి: