బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ అమీర్... గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హడావిడి చేసిన ఎమ్మెల్యే. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా బోధన్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన మైనారిటీ నేత షకీల్...కొన్ని రోజుల క్రితం బీజేపీ ఎంపీ అరవింద్ ని కలిసి సంచలనం సృష్టించారు. ఆయన్ని కలవడమే కాకుండా టీఆర్ఎస్ మీద విమర్శలు కూడా గుప్పించారు. టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యేలకు విలువే లేదని, ఆత్మాభిమానం చంపుకొని బతకలేనని అన్నారు. ఒక్క మైనారిటీ ఎమ్మెల్యే గెలిస్తే, మంత్రి పదవి ఇవ్వలేదని మాట్లాడారు.


అయితే తర్వాత షకీల్ మళ్ళీ మాట మార్చి కేసీఆర్ తన గాడ్ ఫాదర్ అని పొగిడేశారు. ఆ కొన్ని రోజులు ఆయన పేరు తెలంగాణ రాజకీయాల్లో మార్మోగింది. తాజాగా ఆయన పేరు మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అయింది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి హల్చల్ చేసిన షకీల్ కు కేసీఆర్ ఊహించని షాక్ ఇచ్చారు. తాజాగా ప్రకటించిన అసెంబ్లీ కమిటీల్లో షకీల్ కు ఎలాంటి స్థానం కల్పించలేదు.


నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కొందరుకు అవకాశం కల్పించారు గానీ, షకీల్ ని మాత్రం పక్కనబెట్టేశారు. క్యాబినెట్ విస్తరణలో బెర్త్ ఆశించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాని పీఏసీ, మైనార్టీ కమిటీల్లో సభ్యునిగా నియమించారు. అటు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఛైర్మన్ గా అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌లను పబ్లిక్ ఎస్టిమేషన్ కమిటీలో సభ్యులుగా చేర్చగా బీసీ కమిటీ సభ్యునిగా బాజిరెడ్డిని, ఎస్సీ, మైనార్టీ కమిటీ సభ్యునిగా ఎమ్మెల్సీ రాజేశ్వరరావును నియమించారు.


లైబ్రరీ కమిటీ సభ్యునిగా జుక్కల్ ఎమ్మెల్యే షిండేకు అవకాశం కల్పించారు. అలాగే ప్రభుత్వ హామీల కమిటీ ఛైర్మన్ గా ఎమ్మెల్సీ వీజీ గౌడ్ ని, మంత్రి ప్రశాంత్ రెడ్డిని అసెంబ్లీ ప్రత్యేక కమిటీ సభ్యునిగా నియమించారు. ఇలా దాదాపు జిల్లా నుంచి 9 మంది సభ్యుల వరకు పదవులు దక్కిన షకీల్ కు మాత్రం దక్కలేదు. దీనికి కారణం కవితని ఓడించిన బీజేపీ ఎంపీ అరవింద్ ని కలవడమే. అయితే కేసీఆర్ తెలివిగా షకీల్ పై వేటు వేయకుండా...ఇలా ఊహించని షాక్ ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: