మన భారతదేశంలో శృంగారానికి పరిమితులున్నాయి కాని పరిమితి దాటిన శృంగారానికి మాత్రం శిక్షలు లేవు.కొన్ని దేశాలు ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాయి.అక్కడి చట్టాలు,శిక్షలు కూడా అంతే నిర్ధాక్షిణ్యంగా అమలు చేస్తాయి.కొన్ని పరాయి దేశాల్లో సెక్స్ లైఫ్‌ను ఎంతగా ఎంజాయ్ చేసిన పట్టించుకోని చట్టం వరసకాని వరస అయిన వారితో మాత్రం శృంగారం చేస్తే ఒప్పుకోవు.అలాంటి దేశంలో ఇంగ్లాండు కూడ ఒకటి.ఇక్కడి దేశంలో రక్త సంబంధీకులతో లైఫ్‌ను ఎంజాయ్ చేద్దామంటే కుదరదు.అది చట్టరిత్యా నేరంగా పరిగణించ బడుతుంది.



ఇప్పుడు ఇక్కడ ఓ జంట హాయిగా పెళ్లిచేసుకుని సంసారం చేసుకుంటున్నారు.ఆనందంగా సాగుతున్న వారిజీవితంలో ఊహించని షాక్ తగిలింది.ఎనిమిదేళ్ల సంసారం తర్వాత వారిద్దరూ ఒకే తండ్రిబిడ్డలని తెలిసి తలలు పట్టుకున్నారు. ఇంగ్లాండులో చోటుచేసుకున్న ఈ అరుదైన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.ఇంగ్లాండ్‌లో  24 ఏళ్ల వ్యక్తి తనకంటే ఓ సంవత్సరం పెద్దదైన మహిళను ప్రేమించి గతేడాదే పెళ్లి చేసుకుని భార్యా భర్తల్లా కొత్త జీవితాన్ని ప్రారంభించారు.ప్రస్తుతం ఆమె గర్భవతి,ఇక 2020లో ఆ ఇంట్లో మూడో వ్యక్తి అడుగు పెడతాడు అనుకుంటున్న సమయంలో తన భార్య తల్లితో ఇటీవల మాటల సందర్భంగా,ఆమె భర్త గురించి ప్రస్తావనకు వచ్చింది.



అప్పుడు ఆమె చెప్పిన వివరాలు విని షాకయ్యాడు.అసలు విషయం ఏంటంటే నా భార్య తండ్రి మరెవ్వరోకాదు నా తండ్రే. అదినిజమో కాదో తెలుసుకోవాలనే ఆసక్తితో మేం రహస్యంగా డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకున్నాం.రిపోర్టులుకూడా మేమిద్దరం ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలమని తేలింది.ఈ విషయం తెలిసిన తర్వాత భయం పట్టుకుంది.నా బిడ్డ పుట్టినప్పుడు డీఎన్‌ఏ వివరాలను పొందుపరుస్తారు.ఆ సమయంలో ఆమె డీఎన్‌ఏ,నా డీఎన్‌ఏ ఒకటనితెలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారే మో అని భయంగా ఉంది.నా కొడుకు ఆరోగ్యంగా పుడితే ఏ సమస్య లేదు.అలా జరగపోతే మా డీఎన్ఏ వివరాలను బయట పెడతారు.



ఇక ఇంగ్లాండులో రక్త సంబంధికుల మధ్య వైవాహిక,లైంగిక సంబంధాలపై నిషేదంఉంది.ఒకే వ్యక్తికి పుట్టిన బిడ్డలు ఒకరి నొకరు పెళ్లి చేసుకోవడం పిల్లలు జన్యుపరమైన లోపాలను ఎదుర్కొంటారనే కారణంతో ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తోంది ఇక్కడి చట్టం.అందుకే ఆ వ్యక్తి తీవ్ర ఆందోళనకు గురవ్వుతున్నాడు.ఏది ఏమైన స్వంత అన్నాచెళ్లెల్ల మధ్య వైవాహిక బంధం అనేది ఏ దేశం కూడా సమర్ధించని బంధం.తెలియక ఒక్కటైయ్యారు,తెలిసాక ఏం చేస్తారు.అక్కడి చట్టం వీరికోసం చట్టంలో మార్పు తెస్తుందా ఇప్పుడు వారికి పట్టుకున్న టెన్షన్ ఇది..ఏది ఏమైనా ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని బల్లగుద్ది మరి చెబుతున్నారు.భార్య భర్తలుగా మారిన ఈ అన్నా చెళ్లెల్లు..  



మరింత సమాచారం తెలుసుకోండి: