అనుభవాలను ఆదితాళం అచ్చంగా అమితాబే అని చెప్పాలి. ఆయన ఇపుడున్న భారతీయ చలనచిత్ర నటుల్లో సీనియర్ మోస్ట్ కావడమే కదు. నిండా అనుభవాలను పండించుకున్న మేటి నటుడు. ఆయన చెప్పాల్సినవి ఎన్నో ఉన్నాయి. చెబితే వినే వారు ఎవరు అని అడగద్దు కానీ చెప్పేందుకు మాత్రం బోలెడంతా సబ్జెక్ట్ ఆయన దగ్గర ఉంది. ఓ విధంగా అనుభవాల‌ పాఠశాలకు ఆయన ప్రిన్సిపాల్. అయితే అదే పాఠశాలో చిరంజీవి ఇపుడు ప్రొఫెసర్ అనుకోండి.


సినిమాల్లో మెలకువలు అమితాబ్ చెప్పే పరిస్థితి లేదు కానీ రాజకీయాల గురించి మాత్రం ఆయన ఇపుడున్న నటులకు క్లాస్ తీసుకునే స్థాయిలోనే ఉన్నారు. ఆయన 1984 దశకంలోనే రాజకీయాల్లో ఓనమాలు దిద్దేసి ఫెయిలైన స్టూడెంట్. ఆ తరువాత పాతికేళ్లకు చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారు. అపుడు అమితాబ్ చెప్పారట. బాబూ చిరూ రాజకీయాలు మనకు వద్దు. హాయిగా సినిమాలు చేసుకో అని. కానీ చిరంజీవి వినలేదు, ప్రజారాజ్యం పార్టీ  పెట్టి చేయి కాల్చుకున్నారు.


ఇక ఆయన గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ కి కూడా అమితాబ్ చెప్పిచూశారట. సేమ్ సీన్ రిపీట్. పవన్ సైతం రాజకీయాల్లో వేలూ కాలూ పెట్టి కాల్చుకున్న బాపతే. దీంతో ఇద్దరు అన్నదమ్ములూ తన మాట వినలేదని అమితాబ్ తెగ బాధపడ్డారట. ఇదంతా తాపీగా ఇపుడు సైరా ప్రమోషన్లో చిరంజీవిని పక్కన ఉంచుకుని మరీ అమితాబ్ చెబుతూంటే మెగాస్టార్ నవ్వుతూ ఎంజాయ్ చేశారట.


ఇక మెగాస్టార్ కూడా అనుభవాల కళాశాల ప్రొఫెసర్ హోదాలో తన సాటి నటులు రజనీకాంత్, కమల్ హాసన్ లకు కూడా ఇదే నీతి పాఠాలు చెబుతున్నారు. మరి వారు ఎంతవరకూ వింటారో తెలియదు. ఇంట్లో తమ్ముడు పవన్ సైతం వినేటట్టుగా కనిపించట్లేదు. ఏమైనా ఎవరి అనుభవాలు వారివే. మరొకరు చెబితే వినే వారు ఎవరూ ఉండరేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: