స్మార్ట్ ఫోన్లలో ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్ వాట్సాప్. 2020 ఫిబ్రవరి 1వ తేదీ తరువాత వాట్సాప్ యాప్ కొన్ని ఫోన్లలో పని చేయదు. కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ మరియు కొన్ని ఐ ఫోన్స్ లో వాట్సాప్ పని చేయదు. వాట్సాప్ పని చేయదని కంగారు పడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. మీరు ఉపయోగించే మొబైల్స్ అందులో ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. పాతకాలం స్మార్ట్ ఫోన్లు వాడే వారు మాత్రం వాట్సాప్ యాప్ ను వదులుకోవాల్సి రావచ్చు. 
 
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే వారిలో 2.3.7 లేదా అంతకుముందు వెర్షన్లు ఉపయోగించేవారికి ఫిబ్రవరి 1వ తేదీ తరువాత వాట్సాప్ యాప్ సపోర్ట్ చేయదు. యాపిల్ ఫోన్స్ ఉపయోగించే వారిలో ఐఓఎస్ 8 లేదా అంతకంటే పాత వెర్షన్ ఉపయోగించే వారి ఫోన్లలో కూడా వాట్సాప్ సపోర్ట్ చేయదు. కనీసం మీ ఫోన్ లో ఆండ్రాయిడ్ 3.0 వెర్షన్ ఉన్నా ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. 
 
ఐఫోన్లలో 9.0 వెర్షన్ ఉన్న వాళ్లు కూడా ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ఫోన్లలో వాట్సాప్ యాప్ ఎటువంటి సమస్యలు లేకుండా పని చేస్తుంది. ఇప్పటికీ పాత కాలం ఫోన్లు మాత్రమే వాడుతున్నవారు ఎవరైనా ఉంటే వాట్సాప్ యాప్ ఉపయోగించుకోవాలనుకుంటే వాట్సాప్ యాప్ సపోర్ట్ చేసే మొబైల్ కొనుగోలు చేయక తప్పదు. గతంలోనే వాట్సాప్ యాప్ ఇందుకు సంబంధించిన ప్రకటన జారీ చేసింది. 
 
వాట్సాప్ గతంలో కూడా కొన్ని పాత ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన  ఫోన్లకు వాట్సాప్ సేవలను నిలిపివేసింది. 2017 జూన్ నెలలో సింబియాన్ ఎస్ 60 మొబైళ్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. భవిష్యత్తులో వాట్సాప్ యాప్ లో ప్రవేశపెట్టబోయే ఆప్షన్లకు ఈ ఫోన్లు సహకరించకపోవటం వలన మరియు కొన్ని మొబైల్స్ ఓఎస్ లలో సరైన సెక్యూరిటీ ప్రమాణాలు లేకపోవటం వలన వాట్సాప్ ఈ ఫోన్లకు సేవలను నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: