కురుకేత్ర అంటే కురుక్షేత్రం యుద్ధం కాదు.. హరియాణా ఎన్నికల రణరంగం అని అర్ధం.  హరియానాకు ఎన్నికలు జారబోతున్నాయి.  అక్టోబర్ 21 న అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి.  అధికారంలో ఉన్న బీజీపీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నది.  అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్నది.  ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ఒకప్పుడు హరియాణాలో చక్రం తిప్పింది.  కానీ, పార్టీలో చీలికలు కారణంగా ఆ పార్టీ బలహీనపడింది.  


కాగా, ఈ మూడు ప్రధాన పార్టీల మధ్య పోరు రసవత్తరంగా జరుగుతుందా ఏక పక్షంగా జాగుతుందా అన్నది మరో కొన్ని రోజుల్లోనే తేలిపోతుంది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 47 స్థానాల్లో విజయం సాధించింది.  మొత్తం 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీలో బీజేపీ 47, నేషనల్ లోక్ దళ్ 19, కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలు గెలుచుకుంది.  గతంలో కాంగ్రెస్ పార్టీ హవా అక్కడ బాగుండేది.  కానీ, 2014 తరువాత పూర్తిగా మారిపోయింది.  కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాల కారణంగా 2014 ఎన్నికల్లో కుప్పకూలిపోయింది.  


ఇది ఆ పార్టీకి తీరని దెబ్బ అని చెప్పాలి.  దారుణంగా ఓటమిపాలవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు.  ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి హుడా బీజేపీ తీసుకున్న నిర్ణయానికి సపోర్ట్ చేశారు.  ఇది బీజేపీకి కలిసి వచ్చే అంశం అని చెప్పాలి.  అయితే, నిరుద్యోగం, రైతు సమస్యలను ప్రచారంగా మార్చుకోబోతున్నది.  వీటిని ఎంత సమర్ధవంతంగా వాడుకుంటుంది అన్నది తెలియాలి.  పైగా హుడా పలు అవినీతి కేసుల్లో ఉన్నారు.  సోనియా గాంధీ అల్లుడు రాబర్డ్ వధేరాకు సంబంధించిన భూముల అవినీతి కేసులో ఆయన హస్తం ఉంది.  


ఇది ఆయనకు ఎంత వరకు మచ్చను తీసుకొస్తుందో చూడాలి.  దీంతో పాటు కొత్త వాహన చట్టాన్ని కూడా కాంగ్రెస్ ప్రచారంగా వాడుకోబోతున్నది.  అయితే, బీజీపీ సుస్థిర పాలన, ఆర్టికల్ 370 రద్దు, జాతీయ భద్రత, ఎన్ఆర్సి, ఉద్యోగాలు తదితర అంశాలను ప్రచారంగా వాడుకోబోతున్నది. ఇక ప్రధాని, అమిత్ షా నేతృత్వంలో ప్రచారం జరుగుతుంది కాబట్టి ఆ పార్టీని కాంగ్రెస్ ఏ మేరకు ఢీకొట్టబోతుంది అన్నది తెలియాలి.  ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది.  ఇప్పటికే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి.  అక్టోబర్ 21 న ఎన్నికలు జారబోతున్నాయి.  అక్టోబర్ 24 న కౌంటింగ్ ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: