ఐరాసలో పాక్ ఇండియాపై ఎలా విరుచుకుపడిందో తెలిసిందే.  కాశ్మీర్ అంశాన్ని అజెండాగా పెట్టుకొని పాక్ వ్యాఖ్యలు చేసింది. జమ్మూ కాశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్టు పేర్కొంది.  రక్తపాతం, హింసలు ఎక్కువయ్యాయని ఆరోపించింది.  ఐరాసలో ఇండియా విశ్వమానస శ్రేయస్సు, ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిస్తే.. పాక్ మాత్రం కాశ్మీర్ అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఆరోపణలు చేసింది.  


దీనికి ఇండియా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఈ కౌంటర్ తో పాక్ మరో మాట మాట్లాడలేదు. సైలెంట్ గా ఉండిపోయింది.  ఇక చైనా సైతం పాక్ కు మద్దతుగా మాట్లాడింది. చైనా.. పాక్ దేశాల దోస్తీ  మరోమారు అక్కడ కూడా కనిపించింది.  కాశ్మీర్ అంశం దీర్ఘకాలంగా పరిష్కారం కానీ సమస్యగా ఉందని, కాశ్మీర్ లో అన్యాయం జరుగుతోందని ఆరోపించింది.  కాశ్మీర్ సమస్య కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చైనా సైతం ఆరోపించింది.  


ఈ ఆరోపణలపై ఇండియా తిరిగి కౌంటర్ ఇచ్చింది.  జమ్మూ కాశ్మీర్ అంశం ఇండియా అంతర్గత విషయం అని మరో దేశం ఈ విషయంలో జోక్యం చేసుకుంటే ఒప్పుకోబోమని చెప్పింది.  ఇక పీవోకే విషయంలో పాక్ తో చర్చలు జరపాలా వద్దా అన్నది పాక్ అనుసరిస్తున్న విధానాలపై ఆధారపడి ఉంటుంది అని చెప్పింది. ఐరాస నిషేదించిన 130 మంది ఉగ్రవాదులు పాక్ లోనే ఉన్నారని, ఒసామా బీన్ లాడెన్ కు ఆశ్రయం ఇచ్చింది పాక్ కదా అని ఇండియా ప్రశ్నించింది.  


ముందు పాకిస్తాన్ తన ఉగ్రవాదాన్ని వదిలేయాలని, ఉగ్రవాదులను అదుపుచేసిన తరువాతే పక్కదేశాల గురించి మాట్లాడాలని పేర్కొంది.  ఉగ్రవాదాన్ని పక్కన పెట్టుకొని, తమ దేశంలో ఎలాంటి ఉగ్రవాదులు లేరని, కాశ్మీర్ లోని ఉగ్రవాదులను మేమెందుకు పంపుతామని మాటలు మాట్లాడటం సరికాదని ఇండియా పేర్కొంది.  పీవోకే లో జరుగుతున్న విషయాలు ప్రపంచానికి తెలుసునని ఇండియా కౌంటర్ ఇచ్చింది.  మరి ఈ కౌంటర్ కు పాక్ ఎలాంటి రిప్లై ఇస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: