ప్రస్తుతం సమాజంలో మనం నిశ్చింతగా ఏ భయం లేకుండా బతుకుతున్నాం అంటే దానికి కారణం మనందరికీ రక్షణ కల్పించే పోలీసులే . పోలీసులు ఉన్నారు కాబట్టే శాంతిభద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా హాయిగా జీవించగలుగుతున్నాం . అయితే ప్రభుత్వ  అన్ని శాఖల్లో  ఉద్యోగం చేసే  అందరికీ వారంలో ఒకరోజు తప్పకుండా  వీక్లీ ఆఫ్  తప్పనిసరి. 

 

 

 

 

 

 ఒక్క వారంలో వీక్లీ ఆఫ్ దొరక్కపోతే ఇంకో వారంలో  తీసుకుంటారు. ఇక అన్ని పండుగలకి గవర్నమెంట్ హాలిడేస్ ఉండనే ఉన్నాయి. కానీ మనకు రక్షణ కల్పించి 24 గంటలు పనిచేసే పోలీస్ సార్ లకు మాత్రమే వీక్లీ ఆఫ్ అనే ముచ్చట  లేనే లేదూ. 365 రోజులు 24 గంటలు పని చేయాల్సిందే. అవును కదా మరి వాళ్ళు అంతలా పనిచేయడం బట్టే కదా  మనం ఎంత నిశ్చింతగా జీవించగలుగుతున్నాం . వాళ్లకి పండుగలు పబ్బాలు ఏమీ ఉండవు... ప్రతిరోజు ప్రజల రక్షణ కోసం పాటుపడాల్సిందే. 

 

 

 

 

 అయితే గత  కొద్దిరోజులుగా హైదరాబాద్ నగర పోలీసులు తమకు వీక్లీ ఆఫ్ కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై ఆలోచించిన రాష్ట్ర ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసుల డిమాండ్, రాష్ట్ర  పరిస్థితుల దృశ్య... దశలవారీగా హైదరాబాద్  పోలీసులకు వీక్లీ అమలయ్యేలా చర్యలు తీసుకోబోతున్నారు. తొలిదశలో వెస్ట్ జోన్ లోని పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్  ప్రకటించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ సిటీ మొత్తం ఈ వీక్లీ ఆప్ ని అమలు చేయనున్నారు. కాగా  వెస్ట్ జోన్ లో  1367 మంది పోలీసులు తొలిదశలో వీక్లీ ఆఫ్ తీసుకోనున్నట్టు  పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.కాగా తమ  డిమాండ్ మేరకు వీక్లీ ఆఫ్  ప్రకటించడంపై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: