మహారాష్ట్రలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయంగా వాతావరణం వేడెక్కుతోంది.  రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.  కాంగ్రెస్, ఎన్సీపీ లు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.  కాగా, ఎన్నికలకు ముందు ఎన్సీపీ అధినేత శరత్ పవార్ ను ఈడీ ప్రశించింది.  ఈడీ ఆఫీస్ కు రావాలని కోరడంతో అయన తిరస్కరించారు.  తనకు శిఖర్ సహకార బ్యాంక్ స్కాం కు ఎలాంటి సంబంధం లేదని, సంబంధం లేని విషయంలో తనను ప్రశ్నించడం అనవసరం అని పేర్కొన్నారు.  


కానీ, ఈడీ మాత్రం ఈ కేసులో భాగంగా ఆయన్ను కూడా ప్రశ్నించాలని అనుకుంటోంది.  కారణాలు చాలా ఉన్నాయి.  ఈ కేసులో శరత్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ ఉన్నారు.  అజిత్ పవార్ ఉన్నారు కాబట్టి శరత్ పవర్ కు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధం అయ్యింది.  ఈ పరిణామాలు ఇలా జరుగుతున్న సమయంలో పార్టీలో సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అజిత్ పవార్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.  


దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.  ఎందుకు అయన రాజీనామా చేయాల్సి వచ్చిందో తెలియక ఇబ్బందులు పడ్డారు.  అసలు విషయం ఏమిటంటే.. శరద్ పవార్ కు ఈ కేసుతో సంబంధం లేదని, అనవసరంగా ఆయన్ను ఈ కేసులోకి లాగాలని చూస్తున్నారని, తన పేరు కేసులో ఉండటం వలన ఇలా జరిగిందని అందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.  


అనంతరం అయన శరద్ పవార్ తో సమావేశం అయ్యారు.  ఆ తరువాత మీడియాతో మాట్లాడారు.  ఈ వయసులో ఆయన్ను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని అన్నారు.  పెద్ద వయసులో అయన ఇబ్బందులు పడుతున్నారని ఫలితంగా ఇబ్బందులు వస్తాయని చెప్పుకొచ్చారు.  మరో కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మహారాష్ట్రలో రాజీనామాల డ్రామా నడుస్తోంది.  రాజకీయంగా పైచేయి సాధించేందుకు ఇలా ఎత్తులు వేస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు.  మొత్తానికి ఎన్నికలకు ముందు అక్కడ వాతావరణం మరింత వేడెక్కింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: