ఐరాసలో ఆసక్తికరమైన సన్నివేశం జరిగిన సంగతి తెలిసిందే.  ఐరాసలో భారత ప్రధాని మోడీ ప్రసంగాన్ని ప్రతి ఒక్కరు ప్రశంసించారు.  ప్రధానితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు.  అయితే, ప్రధాని మోడీ ప్రసంగం తరువాత, ఐరాసలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విద్వేషపూరితమైన ప్రసంగం చేశారు.  కాశ్మీర్ సమస్య, రక్తపాతం, యుద్ధం, అన్వయుధాలు వంటి వాటి చుట్టూనే అయన ప్రసంగం నడిచింది.  దేనికి ఐరాసలో ఘాటుగా రిప్లయ్ ఇవ్వాలని ఇండియా అనుకుంది.  


ఐరాసలో శాశ్వతభారత రాయభారి అక్బరుద్దీన్ తో రిప్లై ఇస్తే బాగుంటుంది అనుకున్నారు.  ఇస్లామిక్ ఉగ్రవాదం అని అంటున్న ఇమ్రాన్ ఖాన్ కు సరిగ్గా రిప్లయ్ ఇచ్చినట్టు అవుతుంది అనుకున్నారు.  అటు ఇస్లామిక్ దేశాలు కూడా హర్షిస్తాయి.  కానీ, సీనియర్ అధికారి చేత రిప్లయ్ ఇప్పించి ఇమ్రాన్ స్థాయిని పెంచడం కంటే.. ఒక జూనియర్ చేత రిప్లయ్ ఇప్పిస్తే.. ఇమ్రాన్ పరువు తీసినట్టు అవుతుంది అని భావించిన ఇండియా విదిశా మైత్ర చేత రిప్లయ్ ఇప్పించారు.  


ఆమె ఐరాసలో భారత విదేశాంగ శాఖలో దౌత్యవేత్తగా పనిచేస్తున్నారు.  విధాన రూపకల్పన- అధ్యయన వి భాగంలో ఉప కార్యదర్శి హోదాలో ఉన్న ఆమె ఐక్యరాజ్యసమితిలోని భార త రాయబార బృందంలో ఫస్ట్‌ సెక్రటరీగానూ వ్యవహరిస్తున్నారు.  దౌత్యవేత్తలందరిలోకి విదిశా కొత్తవారు.   దీంతో ఆమెను ఎంచుకున్నారు.  ఆమె తెలివిగా ఇమ్రాన్ ఖాన్ ప్రసంగంపై కౌంటర్ ఇచ్చింది.  


ఇమ్రాన్ ఖాన్ ప్రసంగానికి ఆమె ఇచ్చిన రిప్లయ్ ప్రతి ఒక్కరిని ఆకర్షించింది.  కేవలం రాజకీయవేత్తలే కాదు.. సామాన్య ప్రజలు సైతం సోషల్ మీడియాద్వారా విదిశా ఇచ్చిన సమాధానానికి ఫిదా అయ్యారు.  సోషల్ మీడియాలో ఆమెకు బ్రహ్మరధం పడుతున్నారు.  విదిశాతో రిప్లయ్ ఇప్పించి మంచి పని చేశారని, విదిశా ఇచ్చిన సమాధానం అద్భుతంగా ఉందని వేనోళ్ళ కొనియాడుతున్నారు. ఇక పాక్ యుద్దాన్ని కోరుకుంటే అందుకు సమాధానం ఇవ్వడానికి తాముసైతం సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ఇండియా రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: