దసరా స్పెషల్ బంఫర్ ఆఫర్. సరిగ్గా పండుగకు 10 రోజుల ముందు బంగారం ధర భారీగా తగ్గింది. దీంతో పసిడి ప్రేమికులు అంతా పండుగా చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గత కొద్ది రోజులుగా బంగారం ధర పెరుగుతూ తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.                                 


గత నేలంతా పసిడి ప్రేమికులకు చుక్కలు చూపించిన బంగారం ధరలు ఇప్పుడు మెల్లగా దిగి వస్తున్నాయి. 10 గ్రాముల బంగారం ధర 0.15 శాతం తగ్గి రూ.37,640కి చేరుకుంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గిపోయాయి. కిలో వెండి ధర 0.24శాతం తగ్గి రూ. 46,267కు చేరుకుంది. దీంతో పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు.                  


నిన్నటి వరకు 10 గ్రాముల బంగారం ధర రూ.39,885గా ఉండగా ఈ ఒక్క రోజులో అది రూ. 2150కి తగ్గి రూ. 37,740కి చేరింది. ఇక వెండి ధర కూడా రూ. 51,489గా ఉండగా శనివారం రోజున రూ.5,220 తగ్గి రూ. 46,267కు చేరింది. గత కొన్ని వారాలుగా మార్కెట్లలో బంగారం ధరలో స్థిరత్వం లేకుండా పోయింది. ఒకానొక సమయంలో గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా బంగారం ధరలు పెరిగాయి. ఏది ఏమైనా బంగారం ధర దసరా పండుగకు సరిగ్గా 10 రోజులు సమయం ఉన్నప్పుడు ఇంత తగ్గటం పసిడి ప్రియులకు ఊరట నిస్తుంది.                     


మరింత సమాచారం తెలుసుకోండి: