కొన్నింటి నుంచి తప్పించుకోవడానికి కొంతమంది రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. కొంతమంది తీసుకునే నిర్ణయాల కారణంగా ఇరకాటంలో పడుతుంటారు.  కొంతమంది ఎదో విధంగా తప్పించుకొని బయటకు వస్తుంటారు.  అయితే, కొందరికి ఒకే సమస్య పదేపదే ఎదురైతే.. దాని నుంచి తప్పించుకోవడానికి వారు పడే పాట్లు మాములుగా ఉండవు.  దారుణంగా ఉంటాయి.  


ఉక్రెయిన్ కు చెందిన అలెగ్జాండర్ కొండ్రాత్యుక్ అనే 24 సంవత్సరాల యువకుడు సైన్యంలోకి వెళ్లకుండా తప్పించుకోవడానికి ఓ పధకం వేశారు.  సైన్యం చేరకుండా ఉండాలి అంటే తన అవసరం ఇంటికి ఉందని చెప్పేందుకు ఏకంగా 81 సంవత్సరాల వయసున్న ఓ ముసలావిడను పెళ్లి చేసుకున్నాడు.  పెళ్లి చేసుకున్నట్టుగా సర్టిఫికెట్ తీసుకున్నాడు.  అలానే ఆమెకు తన అవసరం ఉంది అన్నట్టుగా కూడా సెర్టిఫికెట్ తీసుకున్నాడు.  


ఆర్మీ అధికారులు ఎప్పుడు అతగాడి దగ్గరకు వచ్చినా ఆ సర్టిఫికెట్ లు చూపించి తప్పించుకుంటున్నాడు.  కారణం ఏంటి అంటే ఆర్మీలో చేరడం ఇష్టం లేదు.  ఇష్టం లేకుండా చేరడం ఎందుకు.. అక్కడ ఏమైనా రూల్ ఉందా అంటే ఉన్నది.  అక్కడి యువకులు తప్పనిసరిగా ఆర్మీలో పనిచేయాలి.  అది రూల్.  ఆ రోల్ ప్రకారం తప్పనిసరి.  అయితే, ఏదైవా కొన్ని కొన్ని కారణాలతో ఆ రూల్ నుంచి బయటపడొచ్చు.  


దాన్ని ఆ యువకుడు ఎంచుకున్నాడు.  ఆర్మీలో చేరకుండా తప్పించుకోవడానికి పధకం వేసి ఇలా చేస్తున్నాడు.  మిగతా సమయాల్లో ఆ యువకుడు ముసలావిడ దగ్గర కనిపించడని, ఆర్మీ అధికారులు వస్తున్నప్పుడు మాత్రమే ప్రత్యక్షం అవుతాడని ఆర్మీ అధికారులు అంటున్నారు.  ఉక్రెయిన్ చట్టాల ప్రకారం ప్రతి యువకుడు ఆర్మీలో కొంతకాలం పనిచేయడం వలన దేశభక్తి, దేశం పట్ల గౌరవం, ఫిట్ గా ఉండటంతో పాటు గౌరవంగా బ్రతికేందుకు అవకాశం ఉంటుంది.  ఇదేదో బాగుంది కదా మన దగ్గర కూడా ఇలాంటి చట్టాలు ఉంటె ఎంత బాగుంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: