టీడీపీ జాతీయాధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడు ఏ ప‌ని చేసిన దానివెనుక అర్థం ప‌ర‌మార్ధం ఉంటుంద‌ట‌.. ఏ కార్యం మొద‌లెట్టినా... అందులో మిగులుడెంత‌.. త‌గులుడెంత‌.. దానితో రాజ‌కీయ ల‌బ్ధి ఎంత‌.. న‌ష్ట‌మెంత అని ముందుగానే లెక్క‌లేసుకుని మ‌రి రంగంలోకి దూకుతాడ‌ట‌. అయితే అవి కొన్నిసార్లు విక‌టిస్తున్నాయి.. ఎందుకంటే.. నేను ఏ లెక్క‌లు వేసినా అవి ప‌క్కాగానే ఉంటాయ‌నే అతి న‌మ్మ‌కం.. అతి ధీమా... కార‌ణ‌మ‌ట‌.. దీనికి తోడు నేను మోనార్క్‌ను న‌న్నేవ్వ‌రు మోసం చేయ‌లేరని త‌న‌కు తానే అనుకుని త‌న‌ను తానే మోసం చేసుకుంటూ.. ఇత‌రుల‌ను మోసం చేస్తాడ‌నే ప్ర‌తీతి.


అయితే రాజ‌కీయ ఎత్తులు వేయ‌డంతో జిత్తులమారి అయిన చంద్రాలు.. క‌ప్ప‌దాటుడు వ్య‌వ‌హారాల్లో ఆరితేరిన మొన‌గాడు. అందుకే చంద్ర‌బాబుతో దోస్తాను చేయాలంటే ఒక‌టికి రెండుసార్లు ఆలోచించాల్సిందే న‌ని కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌కు, పార్టీల‌కు ఇప్ప‌టికే బోధ ప‌డింద‌నుకుంటా.. ఎందుకంటే రాజ‌కీయంగా చంద్ర‌బాబు నాయుడు తీసుకునే నిర్ణ‌యాలు చూస్తే ఆయ‌న నైజం తెలిసిపోతుంది. ఎన్టీఆర్‌ను గ‌ద్దె దించేందుకు ఆయ‌న వేసిన ఉచ్చులో ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యుల‌ను ప‌డేలా చేసి, త‌న అధికార కాంక్ష‌ను, సీఎం పీఠంపై కూర్చోవాల‌నే కుటిల కుట్ర అమ‌లు చేసిన తీరు చూస్తే చంద్రాలు రాజ‌కీయ  చాణ‌క్యం తెలిసిపోతుంది.


చంద్ర‌బాబు టీడీపీలోకి వ‌స్తానంటే ఎన్టీఆర్ ముందుగానే బ‌య‌ప‌డ్డాడ‌ట‌. అందుకే చంద్రాలు టీడీపీలో చేరేందుకు ఎన్టీఆర్‌ను అడిగితే పార్టీలోకి తీసుకోవాలా వ‌ద్దా అని 1983 జ‌న‌వ‌రి 22-24 తేదీల్లో న‌లుగురు స‌భ్యుల‌తో టీడీపీ అధినేత ఎన్టీఆర్ క‌మిటీ వేసాడట‌. క‌మిటీ తీర్మాణం మేర‌కు చంద్రాలును టీడీపీలోకి తీసుకున్నార‌ట‌. అంటే  చంద్రాలు న‌మ్మ‌క‌ద్రోహం మీద ఎన్టీఆర్‌కు ఎంత న‌మ్మ‌కంతో తేలిపోతుంది. 1995 జూలైలో హ‌రికృష్ణ‌కు ఎన్టీఆర్‌కు న‌డుము చంద్రాలు పంచాయితీ పెట్టి కూసున్నాడ‌నే అప‌వాదు ఉంది. త‌రువాత హ‌రికృష్ణ  బావ చంద్రాలు బాట ప‌ట్ట‌డం జ‌రిగింది. దీంతో  చంద్రాలు తాను ప‌న్నిన ఉచ్చులో హరికృష్ణ చిక్కుకున్నాడ‌నుకుని గ్ర‌హించి  అస‌లు ప‌నిని ప్రారంభించాడు.


చంద్ర‌బాబు పంచ‌న చేరి ఎన్టీఆర్‌ను ధిక్క‌రించార‌నే కార‌ణంతో  ఆగ‌స్టు 17న ఎన‌మిది మంది ఎమ్మెల్యేల‌ను పార్టీ నుంచి ఎన్టీఆర్  స‌స్పెండ్ చేయ‌డంతో చంద్ర‌బాబుకు ఆయుధం దొరికింది. ఇదే అద‌నుగా హ‌రికృష్ణ‌ను ఎగ‌దోసిన చంద్రాలు ఆగస్టు 23న వైస్రాయ్ హోటల్‌కు రాజ‌కీయాన్ని మార్చాడు. ఎమ్మెల్యేను వైస్రాయ్ హోటల్‌కు త‌ర‌లించ‌డం, తాను సీఎంగా ఎన్నిక కావ‌డం, సెప్టెంబ‌ర్ 1న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. చంద్ర‌బాబుకు కూతురును ఇస్తే ఇంత మోసం చేస్తాడా.. అంటూ ఎన్టీఆర్ ఆనాడు ప్రెస్‌మీట్ పెట్టి బండ‌బూతులు తిట్టాడు. చంద్రాలు మోసాల‌ను ఏక‌రువు పెట్టాడు.. చంద్ర‌బాబు చేసిన మోసం త‌ట్టుకోలేని ఎన్టీఆర్   17-18 జ‌న‌వ‌రి 1996న  చ‌నిపోవ‌డం జ‌రిగింది. అంటే చంద్రబాబు వెన్నుపోటుతో మామ ఎన్టీఆర్ ప‌ద‌వీనీ, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు.


ఎన్టీఆర్ వెన్నుపోటుతో అధికారంలోకి వ‌చ్చిన‌ చంద్రాలు ప్ర‌తి సారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో పొత్తులు పెట్టుకోవ‌డం అనవాయితీగా వ‌చ్చాయి. 1999, 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రాలు అధికారంలోకి వ‌చ్చాడు. బీజేపీతో అధికారంలోకి రావ‌డం, మిత్ర లాభం పొంద‌డం, మిత్ర సంహారం చేయ‌డం చంద్రాలుకు వెన్న‌తో పెట్టిన విద్య‌. అంత‌కు ముందు కూడా క‌మ్యూనిస్టుల‌తో పొత్తు పెట్టుకోవ‌డం, టీ ఆర్ ఎస్ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవ‌డం  త‌రువాత పొత్తును విచ్ఛిన్నం చేయ‌డం జ‌రిగాయి. ఇక 2018లో తెలంగాణ‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీచేసి, 2019లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పొత్తు లేద‌ని చెప్ప‌డం, అదే విధంగా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో పొత్తు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పొత్తు లేక‌పోవ‌డం ఇలా చిత్ర‌విచిత్రంగా పొత్తులు పెట్టుకున్నాడు.


ఇక ఇప్పుడు హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్‌తో  పొత్తుకు సన్న‌ద్ధం కాకుండా, సొంతంగా పార్టీ అభ్య‌ర్థుల‌ను రంగంలోకి దింపే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. అంటే పొత్తుల పురిక‌ల‌వడం లేద‌న్న‌ట్లే.. అంటే చంద్రాలు త‌న‌కు అనుకూల‌మైతే పొత్తు.. లేకుంటే చిత్తే.. ఇది చంద్రాలు పొత్తులు పేరుతో ఆడే డ్రామాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తునే ఉన్నారు. ఇప్పుడు చంద్రాలు త‌న తాబేదార్ల‌ను బీజేపీలోకి పంపి, మరోమారు బీజేపీతో పొత్తుకు అర్రులు చాస్తున్నాడ‌ట‌. 


మరింత సమాచారం తెలుసుకోండి: